ఇంటర్ పరీక్షలు సమర్థవంతంగా..నిర్వహించాలి


Sat,February 23, 2019 02:08 AM

నాగర్‌కర్నూల్ టౌన్ : ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహించే ఇంటర్ పరీక్షలను సమర్థ్ధవంతంగా నిర్వహించాలని ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి వెం కటరమణ సూచించారు. శుక్రవారం జి ల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ప్రభుత్వ నిర్వాహణ, పర్యవేక్షకులకు, డిపార్ట్‌మెంట్ అధికారులకు, కస్టోడియన్‌లు, సిబ్బందితో సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీ క్ష నిర్వాహణలో ఎలాంటి పొరపాట్లు లే కుండా చూడాలని అధికారులను ఆదేశించారు. స్టోరేజ్ సెంటర్లలో ప్రశ్నా పత్రాల నిల్వ, వాటిని రోజువారి టైం టే బుల్ ప్రకారం కస్టోడియన్లు తగు జాగ్రత్తలతో ఆయా పరీక్ష కేంద్రాలకు, పర్యవేక్షకులకు, డిపార్ట్‌మెంట్ అధికారులకు అందించాలన్నారు. పర్యవేక్షకులు డిపార్ట్‌మెంట్ అధికారులు విధిగా ఉదయం 8గంటలకే స్టోరేజ్ కేంద్రాలకు చేరుకొని ప్రశ్నా పత్రాలను సరి చూసుకోవాలన్నారు. 8.30గంటల తర్వాతే పరీక్ష కేంద్రాలకు వెళ్లాలన్నారు.

తప్పకుండా సెంట్రి రిజిష్ట్రర్‌లో సంతకం చేయాలన్నా రు. పరీక్షా కేంద్రాలలో తాగునీటి వసతి, మరుగుదొడ్లు ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో పోలీస్ వ్యవస్థ, ఆరోగ్యశాఖతో సమన్వయం చేసుకుంటూ ప్ర శాంతంగా పరీక్షలు నిర్వహించాలన్నా రు. ఒక్క నిమిషం ఆలస్యమైతే విద్యార్థికి పరీక్ష హాల్‌లోకి అనుమతి లేదని, ఉదయం 8గంటలకే విద్యార్థులను గదులలోకి అనుమతించాలన్నారు. విద్యార్థులకు స్క్రీనింగ్ చేయుటకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విధి నిర్వాహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో జిల్లా పరీక్షల నిర్వాహణాధికారులు అనసూయ, సై దులు, అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, ప్రధానాచార్యుల సం ఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మా ధవరావు, భగవంతాచారి, రాష్ట్ర నాయకులు చాగంటి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ రాంచంద్రారెడ్డి, వృత్తి విద్యా అ ధ్యాపకులు పాలెం నర్సింహులు, కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...