ఈజీఎస్ ద్వారా 1.89 కోట్ల మొక్కలు


Sat,February 23, 2019 02:08 AM

ఉప్పునుంతల : హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈజీఎస్ ద్వారా కోటీ 89లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా నిర్దేశించినట్లు డీఆర్‌డీవో సుధాకర్ వెల్లడించారు. శుక్రవారం మండలంలోని పెద్దాపూర్, మామిళ్లపల్లి, మొల్గర గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకర్లతో డీఆర్‌డీవో మాట్లాడుతూ మండలంలో ఈజీఎస్ ద్వారా 10 లక్షల 40 వేల మొక్కలు పెంచడానికి ఆయా గ్రామాల నర్సరీల్లో పనులు జరుగుతున్నాయని అన్నారు. జూన్ 1వ తేదీ నాటికి నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉంచడానికి ఈజీఎస్ అధిధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మండలంలో 6లక్షల 14వేల మొక్కలను పెంచడానికి బ్యాగ్ ఫిల్లింగ్ పూర్తయినట్లు తెలిపారు. ఈ నెల 28వ తేదీలోగా అన్ని నర్సరీల్లో బ్యాగ్ ఫిల్లింగ్ పూర్తి కావాలన్నారు.

జిల్లాలో 453 నర్సరీలు ఈజీఎస్, ఫారెస్టు నర్సరీల ద్వారా 2 కోట్ల 89 లక్షల మొక్కలు నాటాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ఈజీఎస్ ద్వారా కోటి 89 లక్షలు, ఫారెస్టు ద్వారా 80 లక్షలు, మున్సిపాలిటీల ద్వారా 20లక్షల మొక్కలు పెంచడం జరుగుందన్నారు. కూలీల కొరత వల్ల ఇప్పటి వరకు జిల్లాలో కోటీ 30 లక్షల బ్యాగ్ ఫిల్లింగ్ పూర్తయినట్లు తెలిపారు. జూన్ మొదటి వారం వరకు మొక్కలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈజీఎస్‌లో ఎలాంటి అవకతవకు లేకకుండా ఈ మొబైల్ ద్వారా కూలీల హాజరు నమోదు చేయాలన్నారు. నర్సరీల్లో మొక్కలు సకాలంలో అందించకుండా నిర్లక్షం చేస్తే సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీవోలు, టెక్నికల్ అధికారులు, ఎంపీడీవోల వేతనాలు నిలిపేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మణ్‌రావు, ఏపీవో సుదర్శన్, దేవదారికుంట తాండ సర్పంచ్ పర్వతాలు నాయక్, క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...