రైతు సంక్షేమమే ధ్యేయం


Fri,February 22, 2019 12:19 AM

తెలకపల్లి : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎంజీకేఎల్‌ఐ నీటితో రైతు బ తుకు మార్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో రూ.1.20 కోట్లతో నిర్మించిన విండో గో దాం, వ్యాపార సముదాయ భవనాలను ఎ మ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. రైతుల కోసం అహర్నిషలు కష్టపడే ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఈ ప్రాంత ప్రజల చిరకా ల కోరిక అయిన ఎంజీకేఎల్‌ఐ ద్వారా కృష్ణాజలాలు అందించి భీడు భూములను సస్యశ్యామలం చేసిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు, రైతుభీమా పథకాలను ప్రవేశపెట్టి ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. సింగిల్‌విండో ద్వారా రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించడంతో పాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు రైతుల ధాన్యం నిల్వ ఉంచడానికి అన్ని సౌకర్యాలతో గోదాంల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. భూ ప్రక్షాళనలో భాగంగా కొత్త పాస్ పుస్తకాలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి, మార్కెట్ చైర్మన్ వెంకటయ్య, జెడ్పీటీసీ నరేందర్‌రెడ్డి, విండో చైర్మన్ భాస్కర్‌రెడ్డి, కార్యదర్శి ధర్మవీర్, రైతు సమితి మండల కో ఆర్డినేటర్ పర్వత్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు రాములు, పర్వతాలు, సర్పంచ్ సురేఖ, ఉప సర్పంచ్ కృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాధవరెడ్డి, వామన్‌గౌడ్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, విండో డైరెక్టర్లు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...