చెంచుల మనోభావాలకు..భంగం కలింగించొద్దు


Fri,February 22, 2019 12:19 AM

నాగర్‌కర్నూల్ టౌన్ : నల్లమల అటవీ ప్రాం తంలోని అమ్రాబాద్ మండలం భౌరాపుర్‌లో చెంచుల ఆరాధ్య దైవం మల్లన్న జాతరను వారి మనోభావాలను భగం కలిగించకుండ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్ట ర్ శ్రీధర్ సూచించారు. గురువారం కలెక్టరే ట్‌లో భౌరాపూర్ పెంటలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 3, 4 తేదీల్లో జరపనున్న జాతర ఏర్పాట్లపై ఐటీడీఏ పీవో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ,జిల్లా వ్యవసాయ, ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్ ఈ.ఈ, అటవీ, పోలీస్‌శాఖల అధికారుల తో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భౌరాపూర్ జాతరలో స్థానికేతరులు, ఎవరు కూడా షాపులు నిర్వహించకుండా పటిష్ట చర్యలు తీసు కోవాలని ఐటీడీఏ పీవోను కలెక్టర్ ఆదేశించారు. భౌరాపూర్ పెంట చెంచులు కలెక్టర్‌ను కలిసి ఇతర ప్రదేశాల నుంచి వ్యక్తులు జాతరకు వచ్చి చెంచుల ఆచారాలకు భంగం కలిగిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో కలెక్టర్ స్పందించి జాతరను వారి సంప్రదాయం ప్రకారంగానే విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీని నియమించాలన్నారు. ఈ కమిటీలో కంటి వెలుగు ప్రత్యేక అధికారి డాక్టర్ సుధాకర్‌లాల్, జిల్లా వ్యవసా య అధికారి సింగారెడ్డి ఆధ్వర్యంలో ఆయా శాఖలతో కలిసి ఈ కమిటీ ఈనెల 25న భౌరాపూర్‌ను సందర్శించి స్థాణిక చెంచుల అభిప్రాయాలు సేకరించాలన్నా రు. జాతర ఏర్పాట్ల ను పరిశీలించి పూర్తి నివేదికను అందించాలని కమిటీ ప్రతి నిధులను కలెక్టర్ ఆదేశించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుం టామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా మేడిమల్కాల చెరువును సందర్శించి చెరువును అభివృద్ధి పరిచి స్థానిక చెంచులకు తాగునీటిని అందిం చాలని కలెక్టర్ ఆదేశించారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...