మెరుగైన వైద్య సేవలందించాలి


Fri,February 22, 2019 12:18 AM

అచ్చంపేట, నమస్తే తెలంగాణ : శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా వైద్యులు, సిబ్బంది సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డా.దశరత్‌నాయక్ కోరారు. గురువారం సాయంత్రం అచ్చంపేట ప్రభుత్వ సివిల్ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంటి వెలుగు జిల్లా అధికారి డా.సుధాకర్‌లాల్, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు డా.వెంకటదాసు, డా.మోహనయ్యలతో కలిసి తనిఖీ చేశారు. ప్రత్యేక నవజాత శిశువు చికిత్స కేంద్రాన్ని తనిఖీ చేసి అందుతున్న సేవలను అక్కడున్న వైద్యులు శివకుమార్, రామకృష్ణలను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఎన్‌సీయూలో ఖాళీగా ఉన్న నాలుగు వైద్య పోస్టులను తాత్కాలిక పద్ధతిపై నియమిస్తామని అన్నారు. నిరుపయోగంలో ఉన్న జనరేటర్ ను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. దవాఖాన సూపరింటెండెంట్‌గా డిప్యూటీ డీఎంహెచ్‌వో వెంకటదాసును నియమిస్తున్నట్లు స్పష్టం చేశారు. డాక్టర్లు, సిబ్బంది విధులు, రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

వైభవంగా తెప్పోత్సవం
పెంట్లవెల్లి : మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారి ఆలయం ముందుభాగా న గల కోనేరులో తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ సువర్ణ రామన్‌గౌడ్, టీఆర్‌ఎస్ ఉమ్మడి మండలాల అధ్యక్షుడు రాజేశ్, ట్రస్టు చైర్మన్ జంగం కృష్ణయ్య, ఎంపీటీసీ పల్లెనాగరాజు, మాజీ సర్పంచులు రాజేశ్, వీరయ్య, కోట్ల సురేందర్, శశికళ, మాజీ విండో చైర్మన్ రామన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...