జిల్లా దవాఖానకు మహర్దశ


Thu,February 21, 2019 12:06 AM

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : జాతీయ ఆరోగ్య మిషన్ ద్వా రా నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాలకు రూ.100కోట్ల చొప్పున మంజూరు కా నున్నాయి. ఈ నిధులతో దవాఖాన రూపు రేఖలు మారబోతున్నాయి. ఒ క్కో దవాఖానకు నూతన భవన నిర్మాణాలు ఆధునిక హంగులతో నిర్మించ డం జరుగుతుంది. ఇందుకోసం ఐదెకరాల స్థలం కావాల్సి ఉంది. అయితే భ విష్యత్తులోని అవసరాల దృష్ట్యా 15ఎకరాల వరకూ సేకరించేలా జిల్లా అధికారులను వైద్య శాఖ అధికారులు కోరనున్నారు. ఈ నిధులతో ప్రస్తుతం ఉన్న భవనం స్థానంలో కొత్త భవనం వ స్తుంది. అలాగే వైద్య సేవల్లో కూడా ఊహించని పురోగతి రానుంది. దీనివల్ల పేదలందరికీ కార్పొరేట్ స్థాయిలో క్షణాల్లో వైద్య సాయం అందుతుంది. ప్రస్తుతం ఈ దవాఖానల్లో ప్రతీ రోజు దాదాపుగా 1000నుంచి 1200మంది వరకు రోగులు చికిత్సలు చేయించుకుంటున్నారు. నూతన హంగులతో దవాఖాన, సేవలు అందుబాటులోకి వస్తే ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశముంది. ఈ దవాఖాన నిర్మాణాలను భవిష్యత్తులో వైద్య విద్య కళాశాలలుగా మా ర్చుకునేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న వై ద్యుల స్పెషలిస్టులకు తోడు హైదరాబాద్‌కు వెళ్లి చికిత్సలు చేయించుకునే పరిస్థితులు లేని రోగాలకు సైతం ఇక్కడే నిర్వహించేలా దవాఖానలు అందుబాటులోకి రానున్నాయి. అదే స్థాయిలో వై ద్య యంత్ర పరికరాలు కూడా సమకూరుతాయి. ఇలా 14రకాల స్పెషాలిటీ వై ద్యసేవలు ఇక్కడే నిర్వహించడం జరుగుతుంది. అలాగే పారామెడికల్ కోర్సు లు, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం శిక్షణ కేంద్రా లు కూడా ఈ దవాఖానలతో పాటే అం దుబాటులోకి వస్తాయి. దీనివల్ల ఈ వై ద్య శిక్షణ పేద విద్యార్థులకు ఉచితంగా స్థానికంగానే లభిస్తుంది. ఈ దవాఖాన సేవలతో పట్టణ శివారు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో నల్లమల, కొల్లాపూర్ అటవీ ప్రాంతంలోని చెంచులు, మారుమూల పల్లెల పేదలకు సైతం ప్రభుత్వ వైద్యం దగ్గరికి వస్తుంది.

పెరగనున్న సేవలు..
జిల్లా దవాఖానల్లో ఇలా వైద్య రం గంలో జరిగే అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల్లో గుణాత్మక మార్పు రానుం ది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెధ్దపీట వేస్తూ రూ.లక్షల్లో నిధులను ఖర్చు చేస్తుంది. అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుతోంది. ఏరియా దవాఖానల్లో, పీహెచ్‌సీల్లోనూ వైద్యుల నియామకంతో ప్రభు త్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. జిల్లా దవాఖానల్లో 24గంటల వైద్యసేవలతో పాటు ఐసీయూ, డయాలసిస్, క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాలు, బ్లడ్ బ్యాంకులు సైతం ఏర్పాటయ్యా యి. అలాగే కాన్పులతో పాటు డెంటిస్ట్, డెర్మటాలజిస్టు, ఆప్తాలమిస్ట్, ఆర్థోపెడీషియన్, తదితర స్పెషలిస్టు వైద్యలు అం దుబాటులో ఉంటూ చికిత్సలు అం దిస్తున్నారు. ఇక కేసీఆర్ కిట్‌తో మాతాశి శు మరణాల సంఖ్య కూడా తగ్గింది. గ ర్భిణీలందరూ ప్రభుత్వ దవాఖానల్లో నే ఉచితంగా సాధారణ కాన్పులు చే యించుకొంటున్నారు. అనారోగ్యాల బారిన పడిన పేదలకు ఆరోగ్య శ్రీతో పాటు సీఎంఆర్‌ఎఫ్ పథకం ద్వారా కూ డా రూ.లక్షల ఖర్చయ్యే వైద్యం కూడా ఉచితంగానే అందుతోంది. జిల్లాలు కొత్తగా ఏర్పడటంతోనే వైద్య రంగంలో సేవల పురోగమనం కనిపిస్తోంది. కంటివెలు గు పథకం ద్వారా లక్షలాది మంది ప్రజలకు కంటి పరీక్షలు జరిగాయి. వే లాది మందికి నాణ్యమైన కంటి అద్దాల పం పిణీ జరిగింది. అలాగే అసంక్రమిత వ్యాధులైన బీపీ, షుగర్‌లాంటి పరీక్షలకూ వైద్యసిబ్బంది ప్రస్తుతం శిబిరాలు నిర్వహిస్తున్నారు. సంపూర్ణ తెలంగాణ సాధన కోసం త్వరలో ప్రజల రక్త న మూనాలను సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారా వైద్య సేవలు అందేలా ప్రభుత్వం ఇప్పటికే వైద్యశాఖకు ఆదేశాల జారీ చేసింది. ఇక ఈ జిల్లా దవాఖానల్లో మల్టీస్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తే ప్రజలు వైద్యానికి చేసే ఖర్చు మిగులుతుంది.

దీనివల్ల పేదలు తమ పిల్లల చదువులు, ఇతర అభివృద్ధి కి వెచ్చించే వీలు ఉంటుంది. కొత్తగా జి ల్లాలు ఏర్పడటంతో కేంద్రం నుంచి మంజూరయ్యే నిధులు కూడా కింది స్థా యికి అందుతున్నాయి. పరిపాలన సౌ లభ్యం కోసం ఏర్పడిన జిల్లాల్లో ఇలా వైద్యసేవల్లో కూడా ప్రగతి కనిపిస్తుండటం విశేషం. సీఎం కేసీఆర్ ప్రత్యే క శ్రద్ధతో తెలంగాణలో అమలవుతున్న నాణ్యమైన వైద్యం రాబోయే కాలంలో మరింత ఉన్నత స్థాయికి చేరనుంది. ప్రతి పేద కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని స్థానికంగానే పొందబోతున్నారు. ఏది ఏమైనా జిల్లాల్లో నిర్మించబోయే ఆధునిక దవాఖానలు ప్రజలకు వైద్యాన్ని మ రింత దగ్గరకు తీసుకురాబోతున్నాయి.

ప్రజలకు మెరుగైన వైద్యం
జిల్లా దవాఖానను రూ.100కోట్లతో నూతనంగా ఆ ధునికంగా నిర్మించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. మె డికల్ కళాశాల స్థాయిలో నిర్మాణం, సేవలు అందించే అ వకాశాలు ఉంటాయి. జాతీయ ఆరోగ్య మిషన్‌కు ఇప్పటికే ప్రతిపాదనలు పంపడం జరిగింది. నాగర్‌కర్నూల్‌లో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొంటారు. ఈ దవాఖాన అందుబాటులోకి వస్తే పేదల ఆరోగ్య ప్రమాణాల్లో మార్పు ఉంటుంది.
- డాక్టర్ ప్రభు, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్, నాగర్‌కర్నూల్

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...