వ్యవసాయం లాభసాటి చేస్తాం


Thu,February 21, 2019 12:04 AM

గద్వాల, నమస్తే తెలంగాణ : రాష్ట్రం ప్రభుత్వం ప్ర తిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ నల్లా కనెక్షన్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కొండూరు శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయన తొలిసారిగా వివిధ స్థాయి అధికారులతో తొలి సారిగా జిల్లాస్థాయి సమీక్షను నిర్వహించారు. కలెక్టర్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహంలు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేలకు కలెక్టర్ గౌరవంగా పూలకుండీలతో స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ హ్యాబిటేషన్‌లలో ఎక్కడెక్కడ మి షన్ భగీరథ పనులు పూర్తయి ప్రజలకు మంచినీరు అందుతోందో అక్కడి సర్పంచుల ద్వారా ధృవీకరణ పత్రం తీసుకురావాల్సిందిగా సంబంధితాధికారులకు కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా ఓవర్ హెడ్ ట్యాంకుల వద్ద ము రుగునీరు నిల్వకుండా, లైన్‌మెన్, వాటర్ గ్రిడ్, ఆర్‌డబ్ల్యూస్ అధికారులు పేర్లు, వారి సెల్ నెంబర్లు రాయవల్సిందిగా సూచించారు. నిర్మాణంలో ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాల్సింది గా ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది పెట్టేలా పనులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ సమీక్షకు హాజరైన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సమన్వయంతో పని చేస్తేనే ఇల్లా అభివృద్ధి ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధి విషయంలో ప్రజలను తమను ప్రశ్నిస్తారని, వారి సమస్యలను పరిష్కరించాలంటే అధికారులపై తాము ఒత్తిడి తీసుకురాకతప్పదన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారు లు పక్కా సన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పని విషయంలో అధికారులకు తమ సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. గట్టు, కేటీ దొడ్డి మండలాల్లో నీటి సమస్య ఉన్నందున అక్కడి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. చాలా చోట్ల పైప్‌లు లీకవుతున్నాయని, వాటిని సరి చేయాలని అధికారులను ఆదేశించారు.

విద్యుత్ శాఖాధికారులు తమ లక్ష్యాలను పూర్తి చేయడంలో అలసత్వం వ్యవహరిస్తున్నారన్నారు. బా ధ్యతాయుతంగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కొరకు ప్రజాప్రతినిధులుగా తమకు ఎంత బాధ్యత ఉందో అధికారులకు కూడా అంతే బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు. పనులను పెం డింగ్ పెట్టకుండా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమం లో ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, వ్యవసాయశాఖ మొదలైన శాఖ అధికారులు పాల్గొన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...