భక్తుల కొంగు బంగారం.. తిక్కవీరేశ్వరస్వామి


Wed,February 20, 2019 11:37 PM

-రేపటి నుంచి మార్చి 4 వరకు బ్రహ్మోత్సవాలు
-22న తిక్కవీరేశ్వరస్వామి ఉత్సవ మూర్తి ఊరేగింపు
-23న ప్రభోత్సవం, 24న రథోత్సవం
-ఏర్పాట్లు పూర్తి చేస్తున్న దేవస్థాన కమిటీ
అయిజ : పిలిస్తే పలికే దైవం .. కొలిచిన వారి కోర్కెలు తీర్చే భక్తులు కొంగు బంగారం .. తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహి ంచేందుకు దేవస్థాన కమిటీ అన్ని ఏర్పా ట్లు చేస్తోంది. అయిజ పట్టణంలో తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి మార్చి 4 వరకు నిర్వహించేందుకు సకల సౌకర్యాలను దేవస్థాన కమిటీ కల్పిస్తోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తా బు చేస్తున్నారు. పట్టణంలోని పెద్ద వాగు సమీపంలో తిక్కవీరప్ప అను మహాపురుషుడు నివసించి సిద్ధి పొందియున్నాడని ఇక్కడి భక్తుల విశ్వాసం. తిక్కవీరప్ప చూ పిన మహిమలు కల్లార చూసిన భక్తులు ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా తిక్కవీరేశ్వ ర స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహించ డం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏటా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలను కనుల పండువగా నిర్వహిస్తున్నా రు. పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద జాతర ఎక్కడ లేనంతగా దేవస్థాన కమిటీ బ్రహ్మోత్సవాలను జరపడం జరుగుతుంది. బ్ర హ్మోత్సవాలకు జిల్లా నలు మూలల నుం చి భక్తులు అశేష సంఖ్యలో తరలివచ్చి తిక్కవీరేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇందుకు గాను దేవాలయ ప్రాంగణంలో అన్నిఏర్పాట్లను చేస్తున్నా రు. ఆలయానికి రంగు రంగుల విద్యుత్ దీపాలను అలంకరిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, నీడ కోసం తడికెలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నడు లేనంతగా బ్ర హ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన కమిటీ చర్యలు తీసుకుంటోంది.

బ్రహ్మోత్సవాల కార్యక్రమ వివరాలు..
పట్టణంలోని తిక్కవీరేశ్వర స్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా 22న శుక్రవారం తిక్కవీరేశ్వరస్వామి ఉత్సవ విగ్రహం ఊరేగింపు, కళశస్థాపన, రాత్రి చట్టసేవ నిర్వహిస్తారు. 23న సాయంత్రం హోమము, రాత్రి ప్రభోత్సవం, 24న ఉదయం నిత్య పూజలు, రాత్రి 12 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భా గంగా 26న కట్టె కోలంట్లు, పలకల కో లంట్లు, భజన పోటీలు నిర్వహించనున్నా రు. 27న బీరప్పడోళ్ల ప్రదర్శన, 28న స్లోబైక్ రేస్ పోటీలు నిర్వహించనున్నారు.

మార్చి 1 నుంచి అంతర్ ర్రాష్ట్ర పశుబల ప్రదర్శన పోటీలు ..
తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 1 నుంచి రైతు సంబురా లు నిర్వహించనున్నారు. ఇందులో భా గంగా మార్చి 1న సేద్యపుటెద్దుల విభాగం పశుబల ప్రదర్శన పోటీలు, 2న సీనియర్ విభాగం పశుబల ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నారు.

మార్చి 4న పండగ చేస్కో (సినీ, టీవీ కళాకారులచే)
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని మా ర్చి 4న పండుగ చేస్కో (సినీ, టీవీ కళాకారులచే) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కమిటీ పేర్కొంది. ఈ ఏడాది జానపద గాయకురాలు, వీ6 తీన్మార్ ఫే మ్ మంగ్లీచే ప్రోగ్రాం నిర్వహించనున్నా రు. రాత్రి అతిథులచే వివిధ పోటీలలో గె లుపొందిన విజేతలకు బహుమతుల ప్ర ధానం, 5న అమవాస్య సందర్భంగా ఆలయంలోని తిక్కవీరేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 6న తిక్కవీరేశ్వరస్వామి ఉత్సవ విగ్రహం ఊరేగింపుతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలకనున్నట్లు దేవస్థాన కమిటీ పేర్కొంది.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...