మృతుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పరామర్శ


Wed,February 20, 2019 11:36 PM

గద్వాల క్రైం : కేటీదొడ్డి మండలం పార్చర్ల గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మంగళవారం మృతి చెందిన తూర్పుతండా గ్రామానికి చెందిన రాము నాయక్, అమరేశ్ నాయక్‌ల కుటుంబ సభ్యులను గద్వాల నియోజక వర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గద్వాల ప్రభుత్వ దవాఖాన ఆవరణలో బుధవారం పరామ ర్శించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను గద్వాల రూరల్ ఎస్సై నాగశేఖర్‌రెడ్డి, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన యువకుల కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. తక్షణ సాయం కింద ఎమ్మెల్యే ఇరు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. రాము నాయక్, అమరేశ్ నాయక్‌ల మృతి పట్ల ఎమ్మెల్యే బండ్ల తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్ నాయకులు శేషంపల్లి నర్సింహులు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...