పూజారి మృతదేహానికి ఘన నివాళి


Wed,February 20, 2019 11:36 PM

మల్దకల్ : మండల కేంద్రంలో మంగళవారం రాత్రి శేషదాస వంశస్థుడు, ఆలయ పూజారి అయిన సుధీర్‌దాస్ (51) గుండె పోటుతో మరిణించిన వియం విధితమే. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి బుధవారం గ్రామానికి చెరుకొని మృతుడు సుధీర్‌దాస్ మృతదేహంపై పూలమాల ఉంచి ఘన నివాళ్లు అర్పించారు. అనంతరం వారి కుంటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన వారికి భరోసా కల్పించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీటీసీ వెంకటన్న, సర్పంచ్ యాకోబు, నాయకులు పరేందర్, బాబురావు, ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, మధుసూదన్‌రెడ్డి, సీతారామిరెడ్డి ధర్మారెడ్డి, ఇతర కార్యకర్తలు ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ కూడా సుధీర్‌దాస్‌కు ఘన నివాళ్లు అర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గోవిందు ఉన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...