ప్రతి విద్యార్థి సమాచారం నమోదు చేయాలి


Sun,February 17, 2019 03:01 AM

- చైల్డ్ ఇన్ఫో పక్కాగా ఉండాలి
- పదో పరీక్షలకు ఏర్పాట్లు చేయండి
- జిల్లా విద్యాధికారి గోవిందరాజులు
- మండలాల అధికారులతో
నాగర్‌కర్నూల్ టౌన్ : జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారులకు, ఎంఐ ఆర్డినేటర్లకు, సీఆర్‌పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ అన్ని యాజమాన్య పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కొరకు నిర్వహించే ప్రణాళిక u-dise పరిశీలించి త్వరగా పూర్తి చేసి జిల్లా కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు. అదేవిధంగా ఉపాధ్యాయుల, విద్యార్థుల బయోమెట్రిక్ అటెండెన్స్‌ను జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వందశాతం అమలు పరచాలని కోరారు. సమావేశంలో సెక్టోరల్ అధికారులు అహ్మద్, వరలక్ష్మి, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

18 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ల కోసం పరీక్షలు..
ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించే టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు సూచించారు. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో శనివారం పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ లోయర్‌లో 339 మంది అభ్యర్థులు, డ్రాయింగ్ హైయ్యర్‌లో 59 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ 189 మంది విద్యార్థులు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ హైయ్యర్‌లో 93 మంది విద్యార్థులు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటల నుండా మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లను WWW.bset.telangana.gov.in వెబ్ సైట్ నుంచి పొందాలని తెలియజేశారు. అదేవిధంగా టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ కుట్టు మిషన్ వెంట తీసుకురావాలని కోరారు. టెక్నికల్ పరీక్షలకు పకడ్భందీగా నిర్వహించాలని డీఈవో అధికారులను ఆదేశించారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...