మత్స్యకారుల సంక్షేమానికి.. ప్రభుత్వం పెద్దపీట


Sat,February 16, 2019 02:23 AM

వంగూరు : మత్స్యకారుల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభు త్వం పెద్దపీట వేసిందని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఉమ్మాపూర్ గ్రామానికి చెందిన 35 మంది మత్స్యకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ టీవీఎస్ ద్విచక్ర వాహనాలను శుక్రవారం అచ్చంపేటలోని ఎ మ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఒక్కరేనన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా పథకాలతో ఆదుకుంటూ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి సాగునీటిని అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు ఏనాడు మత్య్సకారులను పట్టించుకున్న పాపానపోలేదని, నేడు స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వారికి తగిన గుర్తింపు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ 16 సీట్లు గెలుచుకుటుందని చెప్పారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వం మెడలు వొంచి మనకు రావాల్సిన నిధులను రాబట్టుకుంటామన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్ గెలుపే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌కు ప్రజలు అండగా నిలబడాలని కోరారు. కార్యక్రమంలో రైతు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, ఎంపీపీ పర్వతాలు, మత్య్సకారుల సంఘం జిల్లా నాయకుడు నిరంజన్, ఎంపీటీసీ రాంబాబు, సర్పంచ్ ఆంజనేయులు, మాజీ కోప్షన్ సభ్యులు రహీం, నాయకులు వెంకటయ్య, బాలయ్య, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...