రైతుబంధును కాపీకొట్టిన మోడీ..


Sat,February 16, 2019 02:22 AM

అచ్చంపేట రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో 16 పార్లమెంట్ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దీమా వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రజా ప్రయోనాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతతో దూర దృష్టితో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకై ముందుకెళ్తున్న రాష్ట్ర ము ఖ్యమంత్రి కేసీఆర్‌కు మనమందరం అండగా నిలవాలన్నారు. దేశంలో ఎక్కడా లే ని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను నే డు వివిధ రాష్ర్టాలు, దేశ ప్రధాని కూడా అమలు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి అధికార దాహంతో ఒకరిపై ఒకరు వి మర్శలు చేసుకోవడం సిగ్గుచేటని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యాక మరింత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అమలవుతున్న రైతుబంధును కాపీ కొట్టిన మోడీ కిసాన్ సమ్మాన్ నిధిగా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...