5 ఎకరాల్లోపు రైతుల వివరాలివ్వండి


Thu,February 14, 2019 02:12 AM

నాగర్‌కర్నూల్ టౌన్ : ప్రధాన మంత్రి కిసాన్ సంయోజన నిధి పథకానికి 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల వివరాలను సేకరించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి సూచించారు. బుధవారం జిల్లా వ్యవసాయ శాఖాధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్‌బొజ్జా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి కిసాన్ సయోజన పథకం కింద రైతులకు లబ్ధి చేరేందుకు రాష్ట్రంలోని 5 ఎకరాలలోపు వ్యవసాయ పొలం ఉన్న రైతుల సమాచారాన్ని వెంటనే రాష్ట్ర కార్యాలయానికి చేరవేయాలని ఆదేశించారు. ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఈ పథకానికి అనర్హులని, వీరి వివరాలను సేకరించాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా వ్యవసాయశాఖాధికారి సింగారెడ్డి మాట్లాడుతూ జిల్లా నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో 2 లక్షల 53 వేల 135 మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సన్నిధికి దాదాపు 50శాతం మంది రైతులు మాత్రమే ఎంపికవుతారని అంచనా వేస్తున్నామన్నారు.

220
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...