అడవుల సంరక్షణ బాధ్యత అధికారులదే..


Thu,February 14, 2019 02:12 AM

అచ్చంపేట రూరల్ : అమ్రాబాద్ అభయారణ్యం సంరక్షణ బాధ్యత అటవీశాఖ అధికారులదేనని.. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీసీఎఫ్(చీఫ్ కంజర్‌వెటర్ ఆఫ్ ఫారెస్ట్) ఏ కే సిన్హా సూచించారు. బుధవారం పట్టణంలోని ఎస్‌జీ ఫంక్షన్‌హాల్‌లో రెయింజర్స్, సెక్షన్, బీట్ అధికారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మే రకు జంగల్ బచావో-జంగల్ బడావో అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని అడవిలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు చేశారు. ప్రస్తుత వేసవి సీజన్‌లో 214 బీట్లలో బేస్ క్యాంపు వాచర్స్, బీట్, సెక్షన్ అధికారు లు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కొల్లాపూర్, లింగాల రేంజ్‌లో కలప అక్రమ రవాణాకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడీ యాక్టు నమోదు చేయాలన్నారు. సమావేశంలో డీఎఫ్‌వో జోజి, అమ్రాబాద్ ఎఫ్‌డీవో వెంకటేశ్వర్లు రెయింజర్లు, సెక్షన్, బీట్ అధికారులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...