నేటి తరానికి రవ్వా శ్రీహరి దిక్సూచి


Thu,February 14, 2019 02:12 AM

కొల్లాపూర్, నమస్తే తెలంగాణ : అతి సామాన్యుడి నుంచి మహామహోపాధ్యాయుడిగా ఎదిగిన ఆచార్య రవ్వా శ్రీహరి అందరికీ ఆదర్శప్రాయుడని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. తెలుగు సాహిత్యంలో ఎనలేని కృషిచేసిన ఆయన నేటి తరానికి దిక్సూచి అని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో మూసీ సాహిత్యధార, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌కు చెందిన ఓయూ విద్యార్థి డాక్టర్ చించెట్టి యాదగిరి రచించిన ఆచార్య రవ్వా శ్రీహరి తెలుగు రచనలు-సమగ్ర పరిశీలన అనే పరిశోధన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకాన్ని ముఖ్య అతిథిగా హాజరైన రమణాచారి ఆవిష్కరించి రచయిత డాక్టర్ యాదగిరి అభినందించారు. ఆచార్య రవ్వా శ్రీహరి రచనలపై పరిశోధన చేయడం సాహసమని, యువకుడైన రచయిత భవిష్యత్లు మరిన్ని రచనలు చేసి ఉన్నతస్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య రవ్వా శ్రీహరి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆచార్య మనస చెన్నప్ప, ఆచార్య వెల్దండ నిత్యానందరావు, ఆచార్య సాగి కమలాకరశర్మ తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...