ఆదివాసీలు, గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి


Thu,February 14, 2019 02:11 AM

అమ్రాబాద్ రూరల్ : అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఐటీడీఏ పీవో వెంకటయ్య అధికారులకు సూచించారు. బుధవారం మన్ననూర్‌లోని ఐటీడీఏ కార్యాలయంలో పీవో వెంకటయ్య అధ్యక్షతన గిరిజన దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీలు వారి సమస్యల పరిష్కారం కోసం గిరిజన దర్బార్‌కు హాజరై వినతులు ఇవ్వడం, తీసుకోవడం కాకుండా వారి సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మనపై నమ్మకంతో వారు వినతులు ఇస్తారని, వారి నమ్మకాన్ని వయ్ము చేయకుండా ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే దర్బార్‌ను ఏర్పాటు చేసుకున్నామో దానిని అమలు చేసినప్పుడే సార్ధ్థకత లభిస్తుందన్నారు. అంతకు ముందు రంగారెడ్డి జిల్లా గండీడు, ధరూర్ మండలాలకు చెందిన ఆదివాసీ గిరిజన ప్రజాప్రతినిధులు చెంచుగూడాల్లో నీటి ఎద్దడి నివారణ, వ్యక్తిగత రుణాలు, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, వ్యవసాయ పనిముట్లు, కాడెద్దులు పంపిణీ చేయాలని వినతి పత్రాలు సమర్పించారు. వీటిపై స్పందించిన పీవో గిరిజన ప్రతినిధులు ఇచ్చిన వినతులపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపాధిహామీ ప్రత్యేకాధికారి జయరాజు, చెంచు సమాఖ్య ప్రాజెక్టు అధికారి లక్ష్మయ్యతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...