ఎన్నిల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి


Wed,February 13, 2019 01:43 AM

నాగర్‌కర్నూల్ టౌన్ : పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లు పకబ్బందీగా ఉండా లి జిల్లా పార్లమెంట్ ఎన్నికల అధికారి కలెక్టర్ శ్రీధర్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో పార్లమెంట్ ఎన్నికల విధుల నిర్వాహణ ఏర్పాట్లు, సిబ్బంది నియామకానికై సమావేశాన్ని నిర్వహించారు. నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి జీతాలు పొం దుతున్న అన్ని శాఖల్లో పనిచేస్తున్న సి బ్బంది పూర్తి సమాచారాన్ని డీటీవోకో డ్ ద్వారా తెలియజేయాలని, పార్లమెం ట్ ఎన్నికల విధులు నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమాచారం చేరవేయాలని ఆదేశించారు. ఏశాఖ సి బ్బంది అయినా తనకు సమాచారం లే కుండా ఎన్నికల విధులకు తప్పిస్తే ఆ శాఖ ఉన్నతాధికారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని శాఖల్లో పనిచేస్తున్న అందరు సిబ్బంది పేర్ల 42 కాలం ప్రొఫార్మా నందు దీర్ఘకాలిక సెలవులు, మెటర్నటీ సెలవులు, మెడికల్ సెలవులో ఉన్న తదితర వివరాలను రిమార్క్ కాలంలో వారి పేర్లను నమో దు చేయాలన్నారు.

పార్లమెంట్ ఎన్నికల విధుల నిర్వాహణకై 12వేల మం ది సిబ్బంది వివరాలు స్వీకరించాలని నోడల్ అధికారి సింగారెడ్డిని ఆదేశించారు. అదేవిధంగా సోమవారం ఆ యా మండలాల ప్రత్యేక అధికారులు ఆ మండలంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి బూత్‌లెవల్ అధికారి వద్ద ఉండే ఓటు నమోదు, ఓటు సవరణల ప్రొఫార్మాలను నియమ నిబంధనల ప్రకారమే వ్యవహరించారా లేదా విషయాలు తెలుసుకోవాలన్నారు. వారు గ్రామంలో సందర్శించి వివరాలు సేకరించారా.. లేదా ఓటరు నమోదుకు కావలసిన సర్టిఫికెట్లను జతపరిచారా లేదా అనే అంశాలను పరిశీలించి పూర్తి నివేదికలను సమర్పించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఎన్నికల విధులకు పంపిన సిబ్బంది పేర్లు డీటీవో ట్రెజరీకి పంపించే పేర్లు వివరాలు తేడాలు ఉండకూడదన్నారు. సమావేశంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎన్నికల నోడల్ అధికారులు సింగారెడ్డి, అనిల్‌ప్రకాశ్, మోహన్‌రెడ్డి, గోవిందరాజులు, ప్రజ్వల, సురేశ్‌మోహన్, చంద్రశేఖర్, అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...