తొలిపోలింగ్ @ 82.49


Tue,January 22, 2019 02:41 AM

నాగర్ నమస్తే తెలంగాణ ప్రతినిధి : నాగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి విడత విజయవంతంగా జరిగింది. జిల్లాలోని 20మండలాలల పరిధిలోని 453గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మూడు విడతల్లో నామినేషన్ల స్వీకరణ పూర్తి కాగా మంగళవారం కొల్లాపూర్ ఉపసంహరణతో ఆ ప్రక్రియ పూర్తి కానుంది. ఇక తొలివిడతలోని అచ్చంపేట డివిజన్ 160గ్రామ పంచాయతీలు, 1372వార్డు సభ్యుల స్థానాలకు ఈనెల 7,8,9తేదీల్లో నామినేషన్ల స్వీకరణ జరిగింది. ఇందులో ఉపసంహరణ తర్వాత 37గ్రామ పంచాయతీలు, 372వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇక అమ్రాబాద్ నాలుగు, పదరలో ఒక గ్రామంలో ఎస్టీ అభ్యర్థులు లేక ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. దీంతో మొత్తం 118గ్రామ పంచాయతీల సర్పంచ్ 1,004వార్డు సభ్యుల స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. కాగా సర్పంచ్ పదవులకు 296, వార్డు సభ్యుల పదవుల కోసం 2,091మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

ఇక ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రజలు ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకొన్నారు. నిర్ణీత సమయంలోగా ఓట్లు వేయడం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో గ్రామాలకు తరలి వచ్చారు. దీంతో ఏడు మండలాల్లోని ఒక్క అమ్రాబాద్ 70శాతం పోలింగ్ నమోదు కాగా మిగతా మండలాల్లో 80శాతానికిపైగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అచ్చంపేట మండలంలో అత్యధికంగా 91.91శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ఇలా ఏడు మండలాల్లోని ఆయా గ్రామాల్లో మొత్తం 1,41,391మంది ఓటర్లకు గాను 61,330మంది పురుషులు, 20,003మంది మహిళా ఓటర్ల చొప్పున 1,21,333మంది ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ ఎన్నికలను కలెక్టర్ శ్రీధర్, అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్యలు అచ్చంపేటకు చేరుకొని పర్యవేక్షించారు.

గెలుపు సంబురాలు
ఇక మధ్యాహ్నం 2-3గంటల మధ్య నుంచి ఆయా గ్రామాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు గెలుపొందిన అభ్యర్థులను ఎన్నికల అధికారులు ప్రకటించగానే పెద్ద పెట్టున సంబురాలు చేసుకొంటూ నినదించారు. పోలింగ్ ఉదయం నుంచే గ్రామాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గత వారం, పది రోజులుగా చేసిన ప్రచారంతో ఏయే వర్గాల ఓట్లు పడతాయో, లేదోనన్న సందేహాలతో అభ్యర్థులు ఉండగా, గెలుపు ఎవ్వరిని వరిస్తుందోననే అంచనాలతో ప్రజలు గుంపులు, గుంపులుగా చర్చించుకొన్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఈ ఎన్నికలు పండుగను తలపించాయి. ఎన్నికల్లో అత్యధిక శాతం అభ్యర్థులు టీఆర్ మద్దతుదారులే కావడం విశేషం. మొత్తం మీద నల్లమల ప్రాంతమైన అచ్చంపేటలో తొలివిడత ఎన్నికలు విజయవంతంగా పూర్తవ్వడం పట్ల అధికారులు సంతోష వ్యక్తం చేశారు.

ఏకగ్రీవ పంచాయతీలు..
అచ్చంపేట మండలంలో బక్కలింగాయపల్లి, అ క్కారం, మన్నెవారిపల్లి, జోగియ్యతాండా, కన్యతండా, ఎద్దుమిట్టబావి తండా, చేదురురుబావి తండా, బద్మారం తండా, చెంచుఫల్గు తండా, హాజీపూర్
అమ్రాబాద్ మండలంలో..
తెలుగుపల్లి, బి.కె.లక్ష్మాపూర్ తాండ
బల్మూర్ మండలంలో..
అనంతవరం, అంబగిరి, నర్సాయపల్లి,
కొండారెడ్డిపల్లి, చెన్నారం
లింగాల మండలంలో..
ఎంసీ తండా, కొత్తచెరువు తండా, బాకారం, శ్రీరంగాపూర్, సూరాపూర్, పద్మన్నపల్లి, చెన్నంపల్లి, అప్పాపూర్ పెంట, మగ్ధూంపూర్
పదర మండలంలో ..
ఇప్పలపల్లి, జ్యోతినాయక్
ఉప్పునుంతల మండలంలో..
ఉప్పరిపల్లి, మామిళ్లపల్లి, తిప్పాపూర్, తాడూరు
వంగూరు మండలంలో..
చాకలి గుడిసెలు, వెల్ములపల్లి, సర్వారెడ్డిపల్లి తండా, తిప్పారెఢ్డిపల్లి, కోనేటిపూర్
ఎన్నికలు జరగని అమ్రాబాద్ మండలంలోని కల్ములోనిపల్లి, కుమ్మరోనిపల్లి, బికె.లక్ష్మాపూర్, ప్రశాంత్ కాలనీ, వంగురోనిపలి

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...