బయోమెట్రిక్ తప్పనిసరి


Tue,January 22, 2019 02:41 AM

నాగర్ రూరల్ : ప్రతి పాఠశాలలో తప్పనిసరిగ్గా బయోమెట్రిక్ విధానంలోనే ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుశాతాన్ని నమో దు చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ సెక్టోరల్ అధికారులు ఆహ్మద్, శ్రీనివాసులు అన్నారు. సోమవారం మండలంలోని శ్రీపురం ప్రాథమిక పాఠశాల, తూడుకుర్తి ఉర్దూ మీడియం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను వారు సందర్శించారు. ఈ మేరకు మధ్యాహ్న భోజనం, బయోమెట్రిక్ అటెండెన్స్ విద్యార్థుల నమోదుశాతాన్ని తెలుసుకున్నారు. తూడుకుర్తి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వృత్తి విద్యలో భాగంగా నేర్పించిన కుట్లు, అల్లికలు, ఎంబ్రాయడ్ పనుల ద్వారా విద్యార్థులు చేసిన వస్తువులను పరిశీలించారు. పాఠశాల విద్యార్థులు ఎంబ్రాయిడింగ్ నైపుణ్యం కలిగి ఉండడంతో ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో హెచ్ వెంకటయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...