హెచ్ వన్ నాకౌట్ క్రికెట్ టోర్నీలో మహబూబ్ గెలుపు


Tue,January 22, 2019 02:40 AM

మహబూబ్ స్పోర్ట్స్ : సికింద్రాబాద్ జింఖాన మైదానంలో జరుగుతున్న హెచ్ వన్ నాకౌట్ క్రికెట్ టోర్నీ ఉమ్మడి మహబూబ్ జట్టు శ్రీచక్ర జట్టుపై 131 భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్ టాస్ గెలిచిన మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్ జట్టు 45 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 281పరుగులు చేసింది. జట్టులో గణేశ్ 106 బంతుల్లో 7 పోర్లు, 2 సిక్స్ 82, ఖయ్యూం 73 బంతుల్లో 6 పోర్లు 2 సిక్స్ 73, మహేశ్ 30 బంతుల్లో 5 పోర్లు రెండు సిక్స్ 51 పరుగులు చేయగా, నవీన్ 25 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. అనంతరం బ్యాంటింగ్ శ్రీచక్ర జట్టు 40.3 ఓవర్లలో 150 పరుగులకు అలౌట్ అయ్యింది. జట్టులో అరుణ్ 30, తమీమ్ 20 పరుగులు చేసి రాణించారు. జిల్లా బౌలర్లలో ఖయ్యూం, మహేశ్ చేరో నా లుగు వికెట్లు తీసి తక్కువ స్కోర్ శ్రీచక్ర జట్టును అలౌట్ చేశారు. భారీ పరుగుల తేడా తో జిల్లా జట్టు గెలువడం పట్ల జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కోచ్ మన్నాన్ జట్టు క్రీడాకారులను అభినందించారు. అనంతరం జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ ఈ టోర్నీలో ప్రతిభ కనబరిస్తే త్వరలో జరగనున్న సయ్యద్ ముస్తాక్ 20-20, హెచ్ అండర్-23 క్రికెట్ టోర్నీ ఎంపికవుతారని తెలిపారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...