నువ్వా..నేనా


Tue,January 22, 2019 02:40 AM

నాగర్ నమస్తే తెలంగాణ ప్రతినిధి : నాగర్ జిల్లాలోని 453గ్రామ పంచాయతీలకు గాను తొలి విడతలో అచ్చంపేటలోని ఏడు మండలాలకు సోమవారం ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. రెండో విడతలోని కల్వకుర్తి మండలాలకు నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ పూర్తయ్యింది. ఇక మూడో విడతలో కొల్లాపూర్, నాగర్ అసెంబ్లీ పరిధిలోని ఏడు మండలాలకు స్వీకరించిన నామినేషన్లను అభ్యర్థులు మంగళవారం ఉపసంహరించుకొనే గడువు ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో నామినేషన్ల ఉపసంహరణ కోసం పెద్ద ఎత్తున అభ్యర్థులు, వారి తరపున నాయకులు మంతనాలు సాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రస్తుతం ఉన్న పంచాయతీ రిజర్వేషన్లే వర్తించనుండటంతో పాటుగా టీఆర్ ప్రభుత్వం పంచాయతీలకు అధిక నిధులు మంజూరు చేయనుంది. ఇక ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున పారితోషికం కూడా అందించడం జరుగుతోంది. దీంతో ఆయా గ్రామాల్లో తమ పట్టు నిలుపుకొని ఏకగ్రీవం కావడానికి లేదంటే బలమైన అభ్యర్థులను తప్పించి తామే గెలిచేలా అభ్యర్థులు తమ వంతు పైరవీలు చేస్తున్నారు. ఇక మొత్తం మీద కొల్లాపూర్, నాగర్ అసెంబ్లీలోని మండలాల ఎన్నికలను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటుగా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. టీఆర్ మద్దతుదారులను గెలిపించేలా పార్టీ మండల నాయకులకు సూచించారు. ఇక ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం అందజేసే రూ.10లక్షల పారితోషికాన్ని ప్రజలకి వివరించారు. నాగర్ ఏకగ్రీవ పంచాయతీలకు అదనంగా రూ.10లక్షలు మంజూరు చేయించనున్నట్లు ఎమ్మెల్యే మర్రి ప్రకటించారు. ఇలా మూడో విడత పంచాయతీ సమరానికి బరిలో నిలిచే అభ్యర్థులు ఎవ్వరో మంగళవారం స్పష్టత రానుంది. జిల్లాలోని 20మండలాల పరిధిలోని 453గ్రామ పంచాయతీలకు, 4048వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి.

ఇక రెండో విడత..
తొలివిడతలో అచ్చంపేట, లింగాల, బల్మూర్, ఉప్పునుంతల, అమ్రాబాద్, పదర, వంగూరు మండలాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. రెండో విడతలో కల్వకుర్తి, వెల్దండ, ఊర్కొండ, చారకొండ, తాడూరు, తెలకపల్లి, మూడో విడతలో నాగరకర్నూల్, బిజినేపల్లి, తిమ్మాజిపేట, కొల్లాపూర్, కోడేరు, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాలకు ఈనెల 25వ తేదీన పోలింగ్ ఉంటుంది. ఈ మండలాల్లో 141 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు 673నామినేషన్లు, 1240వార్డు సభ్యుల స్థానాలకు 3వేలకుపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 21గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం గమనార్హం. ఈ గ్రామాలను మినహాయిస్తే 120గ్రామాల సర్పంచ్ పదవులకు 451మంది, వార్డు స్థానాలకు 2,504మంది పోటీలో నిలిచారు. ఇప్పటికే ఉపసంహరణ పూర్తవ్వడంతో గుర్తులు లభించిన అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రేయింబవళ్లు అనకుండా ఇంటింటినీ ఒకటికి పదిసార్లు చుట్టేస్తున్నారు. ఇక చివరగా మూడో విడతలోని ఏడు మండలాల్లోని 152గ్రామ పంచాయతీల సర్పంచ్ 1028నామినేషన్లు, 1432వార్డు సభ్యుల పదవులకు 3,918చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ మండలాల్లోనూ ఏకగ్రీవాల కోసం ప్రజలు సమిష్టిగా కదులుతున్నారు. మంగళవారం నామినేష్ల ఉపసంహరణ జరగనుండటంతో ఆయా గ్రామాల్లో ఓవైపు ప్రచారం, మరోవైపు మంతనాలు సాగుతున్నాయి. ఇలా మంగళవారం నాటి ఉపసంహరణతో పంచాయతీ పోరులో గ్రామాల్లో నువ్వా...నేనా అంటూ పోటీలో ఉండే అభ్యర్థులు ఎవరో స్పష్టత రానుంది.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...