అడవులకు సంరక్షణకు చర్యలు


Mon,January 21, 2019 12:04 AM

అమ్రాబాద్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం అడవుల సంరక్షణకు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నదని, సీఎం కేసీఆర్ అడవులు, అటవీ జంతువుల సంరక్షణకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఉన్నతస్థాయి అటవీశాఖ అధికారులకు సూచించారని (ఏటీఆర్) ఎఫ్‌డీ వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం నల్లమల అటవీ ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నమస్తేతో మాట్లాడుతూ.. నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో అడవీ జంతువులకు తాగునీటి సౌకర్యాలు కల్పించుటతో పాటు పర్యాటకులను మరింతగా ఆకర్శించే విధంగా అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో అమ్రాబాద్, మన్ననూర్ రేయింజ్‌లలో పర్యటించినట్లు తెలిపారు. యాత్రికులకు నల్లమల అందాలను మరింతగా చూసేలా ప్రణాళికలు రూపొందించామని అందుకు గతంలో టెండర్ పక్రియను పూర్తి చేశామన్నారు. సెంట్రల్ అసిస్ట్ టైగర్ మప్రాజెక్టు స్కీం ద్వారా రూ.20లక్షలు మంజూరు అయ్యాయని అందుకు టెండర్ కాల్ చేయగా.. టెండరు దారుడు 30శాతం లెస్‌తో రూ.12 లక్షలకు దక్కించుకున్నాడని తెలిపారు.

మండలంలోని మన్ననూర్ గ్రామం శ్రీశైలం వైపున చివరన ఉన్న దుర్వాసుల చెరువు నుంచి గుండం వరకు 16కిమీ సఫారి లైన్ చేపడుతున్నామని, దీంతొ వాగు నుంచి గుండం వరకు అనగా 4.5కి.మీ దూరం ట్రయల్ పాత్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. దీంతో పాటు మన్ననూర్ రేయింజ్‌లోని దోవునిసార ప్రాంతం నుంచి పుల్లాయిపల్లి బేస్ క్యాంప్ వరకు కాలినడుకన పర్యటన చేశామని, ముఖ్యంగా వేసవిలో తీవ్ర వర్షాభావ ప్రతికూల పరిస్థితులు గత రెండు సం.రాలు నెలకొనడంతో అటవీ జంతవులకు తాగునీటి ఏర్పాట్లు ఎలా చేపట్టాలో ఒక అంచనాకు వచ్చామన్నారు. ప్రధానంగా అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని తుర్కపల్లి బేస్ క్యాంఫ్ పరిధిలో ఉన్న నడిమికుంట వద్ద గతంలోనే బోరును వేసి సోలార్ ద్వారా విద్యుత్ సరఫరాతో ఆ కుంటలో నిత్యం నీరు ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ఎఫ్‌డీవో వెంకటేశ్వర్లు, అమ్రాబాద్ రేయింజర్ ప్రభాకర్, డీఆర్వో లక్ష్మికాంతరావు, అటవీశాఖ సెక్షన్ అధికారి పర్వతాలు, వాచర్లు ఉన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...