పంచాయతీ ఎన్నికల్లో.. గులాబీ జెండా ఎగరాలి


Mon,January 21, 2019 12:03 AM

వెల్దండ : కల్వకుర్తి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. టీఆర్‌ఎస్ మద్దతు దారులకు మద్దతుఆ ఆదివారం వెల్దండ మండ లం కుప్పగండ్లలో సంతోష, చెర్కూర్‌లో అలివేలుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్వకు ర్తి నియోజకవర్గంలో 170 గ్రామ పం చాయతీల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని, ఇప్పటికే 50పైగా జీపీల్లో టీఆర్‌ఎస్ మద్దతు దారులను ఏకగ్రీవం చేసినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ సర్పంచ్‌లను గెలిపించుకుంటేనే గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలే టీఆర్‌ఎస్‌కు రక్ష అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధం గా గ్రామాల అభివృద్ధికి టీఆర్‌ఎస్ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో కల్వకు ర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ విజితారెడ్డి, నాయకులు సంజీవ్‌కుమార్, చెర్కూర్ మాజీ ఎంపీటీసీ భీమయ్యగౌడ్, కుప్పగండ్ల నాయకులు రమేశ్, వెంకటయ్య, బద్రి, గఫార్, లక్ష్మయ్య, అంజయ్య ఉన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...