ఉమామహేశ్వరంలో భక్తుల సందడి


Mon,January 21, 2019 12:03 AM

అచ్చంపేట రూరల్ : శ్రీశైల ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రం భక్తులు, పర్యాటకులతో ఆదివారం కిటకిటలాడింది. నల్లమల కొండల నడుమ కొలువైన దేవస్థానానికి భక్తులు, పర్యాటకులు వేలాదిగా తరలొచ్చారు. ఏటా జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే ఉమామహేశ్వరుడి బ్రహ్మోత్సావాలు కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం కుంకుమార్చన, అభిషేకం, హారతులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం పాప నాశనము వద్ద ఉత్తరాయణ పుణ్యకాల స్నానం చేశారు. దీంతో ఆదివారం సాయంత్రానికి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. క్షేత్రం వద్ద భక్తులు సేద తీరేందుకు గదులు, అడుగడుగునా తాగునీటి సౌకర్యం, వైద్య శిబిరం, పోలీసుల భద్రతో బ్రహ్మోత్సవాలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఐదు రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాలను ఆలయ ప్రధాన అర్చకుడు రాంమూర్తి శర్మ, వీరయ్య శాస్త్రి, నీలకంఠ శాస్త్రి ల వేదమంత్రాలతో పూర్తి చేశారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ కందూరి సుధాకర్, ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాస్‌రావు, సిబ్బంది రామకృష్ణ, లక్ష్మయ్య, పర్వతాలు తదితరులు ఉన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...