కారెక్కుతున్న కాంగ్రెస్ నేతలు


Sun,January 20, 2019 02:12 AM

తెలకపల్లి : మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ, నాగం జనార్దన్ ముఖ్య అనుచరుడు యాదయ్య తన అనుచరులతో శనివారం హైదరాబాద్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ నివాసంలో టీఆర్ చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామపంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉన్నటువంటి సర్పంచ్, వార్డు సభ్యుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నరేందర్ టీఆర్ మండలాధ్యక్షుడు హన్మంత్ నాయకులు కృష్ణ, సుందర్ లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్లు, రమేశ్ ఉన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
సమక్షంలో..
ఊర్కొండ : మండలంలోని నర్సంపల్లికి చెందిన కాంగ్రెస్, టీడీపీకి చెందిన 50మంది నాయకులు, కార్యకర్తలు శనివారం ఎమ్యెల్యే డా.సీ.లక్ష్మారెడ్డి సమక్షంలో హైదరాబాద్ ఆయన నివాసంలో టీఆర్ చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి అహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్ నాయకులు. దామోదర్ విఠల్, కృష్ణయ్య, కాషయ్యతో పాటు పార్టీలో చేరిన వివిధ పార్టీల నాయకులు గోపాల్, తిరుపతిరెడ్డి, చంద్రయ్య, వెంకటయ్య, శ్రీశైలం, మల్లయ్య ఉన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...