స్థానిక ఎన్నికల్లో 100 శాతం స్థానాలు టీఆర్


Sun,January 20, 2019 02:12 AM

కొల్లాపూర్, నమస్తే తెలంగాణ : స్థానిక ఎన్నికల్లో 100శాతం స్థానాలు టీఆర్ కైవసం చేసుకుంటుందని, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం కొల్లాపూర్ పార్టీ కా ర్యాలయంలో కల్వకుర్తి మాజీ ఎమ్మె ల్యే ఎడ్మకిష్టారెడ్డి, టీఆర్ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్ కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన ఫెడరల్ ఫ్రంట్ ద్వారా దేశ రాజకీయాల్లో కీలక మార్పు వస్తుందని మాజీ మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. రైతు బిడ్డ, సుదీర్ఘ అనుభవం కలిగిన పోచారం శ్రీనివాస్ స్పీకర్ సీఎం కేసీఆర్ ఎంపిక చేయడం పట్ల సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ మంత్రిగా గతంలో అనేక మంత్రి పదవులు చేసిన పోచారంకు సముచిత స్థానం కల్పించడం సంతోషకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు పొందడం కోసం, తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరందించేందుకు కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రాం తీయ పార్టీలు ఏకం కావాలన్నారు.

ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీలతో జతకట్టి కేంద్రంలో అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. దీంతో రెండు తెలుగు రాష్ర్టాల ప్రయోజనాల అభివృద్ధి ఆకాంక్షిస్తూ అంధ్రప్రదేశ్ ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్ టీఆర్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కలిశారని, దీన్ని తామంతా స్వాగతిస్తున్నామన్నారు. కొల్లాపూర్ ఓటమి చవిచూసినా.. నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపదడని, నా రాజకీయ జీవితం కొల్లాపూర్ అంకితమని ఆయన స్ప ష్టం చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో పంచాయితీ ఎన్నికల్లో టీఆర్ మద్దతు దారులు విజయ దుందు భీ మోగిస్తారన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎడ్మకిష్టారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రానున్నదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొల్లాపూర్ జరిగిన పరిమాణాలు చాలా బాధాకరమని, గెలుపోటములు సహజమన్నారు. టీఆర్ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్ మాట్లాడుతూ.. తమ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, వైఎస్ అధ్యక్షుడు జగన్ చర్చించితే తుప్పుపట్టిన టీడీపీ నాయకులు 2014లో ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, ఆ తరువాత దూరం కావడం పట్ల ఆపార్టీ వైఖరిని తీవ్రంగా ఖండించారు. మరో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ టీడీపీని ప్రజ లు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...