అశ్వవాహనంపై ‘ఉమామహేశ్వరుడు’


Sun,January 20, 2019 02:11 AM

-భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రం
-ఈ నెల 22 వరకు బ్రహ్మోత్సవాలు
అచ్చంపేట రూరల్ : శ్రీశైల ఉత్తర ధ్వారమైన ఉమామహేశ్వర క్షేత్రం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. నల్లమల కొండల్లో కొలువైన ఉమామహేశ్వరుడు పర్యాటకులకు ఆకర్షణగా నిలుస్తున్నాడు. ఈ నెల 15న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలలో భా గంగా శనివారం ఉమామహేశ్వరుడికి పాప నాశనము నుంచి అశ్వవాహాన సేవ నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున రుద్రాభిషేకము, హోమం, శేష హోమం, త్రిశుల స్నా నం మొదలైన పూజలు నిర్వహించారు. అశ్వవాహన సేవకు 3 వేలకు పైగా హాజరైన భక్తులకు దేవస్థాన చైర్మన్ సుధాకర్, కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు అడుగడుగునా తాగునీటి సౌకర్యం, సేద తీరేందుకు ప్రత్యే గదులు, బారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు పర్యవేక్షణ నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 వరకు కొనసాగనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ పేర్కొన్నారు. హిందువుల ఆరాధ్య ధైవంగా భావించే శైవ క్షేత్రం ఉమామహేశ్వరంలో ముస్లిం మహిళలు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. శివుడికి అభిషేకం నిర్వహించి తమ మొక్కుబలను తీర్చుకున్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...