‘తొలి’పోరుకు సిద్ధం..!


Sun,January 20, 2019 02:11 AM

నాగర్ నమస్తే తెలంగాణ ప్రతినిధి: నాగర్ జిల్లాలోని 20 మండలాల పరిధిలోని 453గ్రామ పం చాయతీలకు, 4048వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. తొలివిడతలో అచ్చంపేట, లింగాల, బ ల్మూర్, ఉప్పునుంతల, అమ్రాబాద్, పద ర, వంగూరు మండలాలకు, రెండో విడతలో కల్వకుర్తి, వెల్దండ, ఊర్కొండ, చారకొండ, తాడూరు, తెలకపల్లి, మూడో విడతలో నాగరకర్నూల్, బిజినేపల్లి, తిమ్మాజిపేట, కొల్లాపూర్, కోడేరు, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాలకు పోలింగ్ ఉంటుంది. దీనికోసం వేలాది సంఖ్యలో అభ్యర్థులు పోటీలో నిలిచారు.
-తొలివిడతలోని 160సర్పంచ్ స్థా నాలకు 848నామినేషన్లు, 1,376వార్డులకు 3028నామినేషన్లు దాఖలయ్యా యి. ఇందులో 37గ్రామ పంచాయతీలు, 364వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అ మ్రాబాద్ మండలంలోని నాలుగు పం చాయతీలకు ఎస్టీ అభ్యర్థులు లేక ఎన్నికలు జరగడం లేదు. ఇక ఉపసంహరణ అనంతరం మొత్తం 119పంచాయతీల కు 296మంది సర్పంచ్ పదవులకు, 1,012మంది వార్డు స్థానాలకు బరిలో నిలబడ్డారు.
-రెండో విడతలోని ఆరు మండలా ల్లో సర్పంచ్ 141 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు 673నామినేషన్లు, 1240వార్డు సభ్యుల స్థానాలకు 3వేలకుపైగా నామినేషన్లు దాఖలయ్యా యి. ఇందులో 21గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం గమనార్హం. ఈ గ్రా మాలను మినహాయిస్తే 120గ్రామాల స ర్పం చ్ పదవులకు 451మంది, వార్డు స్థానాలకు 2,504మంది పోటీలో నిలిచారు.
-ఇక చివరగా మూడో విడతలోని 152గ్రామ పంచాయతీల సర్పంచ్ 1028 నామినేషన్లు, 1432వార్డు సభ్యు ల పదవులకు 3,918చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ మండలాల్లోనూ ఏకగ్రీవాల కోసం ప్రజలు సమిష్టిగా కదులుతున్నారు. ఈనెల 22వ తేదీతోనామినేష్ల ఉపసంహరణ తర్వాత బరి లో ఉండే అభ్యర్థుల్లో స్పష్టత వస్తుంది. మొత్తం మీద మూడు విడతల్లోనూ స ర్పంచ్, వార్డు సభ్యుల పోటీలకు వేలాది సంఖ్యలో అభ్యర్థులు పోటీలో నిలవడం విశేషం.
రంగంలోకి ఎమ్మెల్యేలు
నామినేషన్ల ఘట్టం పూర్తవ్వడం, రెండు విడతల్లోని పంచాయతీల అభ్యర్థులకు గుర్తులు సైతం రావడంతో గ్రామా ల్లో ఎన్నికల ప్రచారం రంజుగా సాగుతోంది. అత్యధిక సంఖ్యలో టీఆర్ పార్టీలోని నాయకులే గ్రామాల్లో పోటీ చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులే కరువయ్యారు. ఆయా పార్టీల నాయకులు సైతం గ్రామంలో తమకు సహకరించే టీఆర్ అభ్యర్థులకు సహకరిస్తున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...