టీఆర్ పోటీకి దూరం..!


Sun,January 20, 2019 02:11 AM

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ పార్టీ అఖండ విజయం సాధించి అధికారంలో ఉండటంతో ఆయా పార్టీ మద్దతుదారులకు ఓట్లు పడే పరిస్థితులు లేవు. దీంతో టీఆర్ అభ్యర్థులు పోటీకి దూరమయ్యారు. ప్రజలు మాత్రం పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో తమకు మేలు చేకూర్చే అభ్యర్థులవైపు చూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల అండ ఎవ్వరికి ఉందోననే అంచనాలు వేసుకొంటున్నారు.
తొలివిడతలోని అచ్చంపేట మండలాలకు ఎన్నికల ప్రచారం శనివారంతో ము గిసింది. సోమవారం ఆయా గ్రామా ల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో నల్లమ ల ప్రాంతంలో అభ్యర్థులు ఓటర్లను పలు రకాలుగా తమవైపు తిప్పుకునేలా ప్రచా రం చేపట్టారు. మందు, విం దుతోనూ మచ్చిక చేసుకొనే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఉదయం, సాయంత్రం ఇం టింటి ప్రచారం చేపడుతున్నారు. ఇక ముఖ్యమైన నాయకులు, టీఆర్ బలపర్చిన గ్రామాల్లోని అభ్యర్థుల గెలుపు కో సం అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బా లరాజుతో పాటు కల్వకుర్తి, నాగర్ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, ఎ మ్మెల్యే మర్రి జనార్దన్ కొల్లాపూర్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రచా రం చేపడుతోన్నారు. టీఆర్ మద్దతుదారులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు మరోసారి అర్థమయ్యేలా వివరిస్తున్నారు. కాగా టీఆర్ అభివృద్ధి అని నమ్ముతోన్న ప్రజలు గులాబీ మద్దతుదారులను ఆశీర్వదించేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొ త్తం మీద అచ్చంపేటలో సోమవారం ఎ న్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కల్వకుర్తి, నాగర్ కొల్లాపూర్ ప్రాంతాల్లోనూ ఎన్నికల ప్రచారం ఊపందుకొంది.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...