ముగిసిన నామినేషన్ల ఘట్టం!


Sat,January 19, 2019 02:01 AM

నాగర్ నమస్తే తెలంగాణ ప్రతినిధి : గ్రామపంచాయతీ ఎన్నికల్లో మూడో విడత నామినేషన్ల స్వీకరణ ముగిసింది. కొల్లాపూర్ అసెంబ్లీ పరిధిలోని కోడేరు, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాలతో పాటుగా నాగర్ అసెంబ్లీ పరిధిలోని బిజినేపల్లి, తిమ్మాజిపేట, నాగర్ మండలాల్లో మొత్తం 152 గ్రామ పంచాయతీలకు గాను ఈ నెల 16నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మొదటి రోజు కొద్ది సంఖ్యలో మాత్రమే నామినేషన్లు వచ్చాయి. రెండో రోజు గురువారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక శుక్రవారం నామినేషన్ల పర్వం ముగిసింది. రాత్రి వరకు అధికారులు ఆయా క్లస్టర్ల వారిగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లను ఉన్నతాధికారులకు నివేధించారు. రెండు రోజుల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు 371 నామినేషన్లు, 1432 వార్డు సభ్యులకు గాను 1129 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 45, వార్డు సభ్యుల పదవులకు 62 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం చివరి రోజు అంత కంటే భారీ సంఖ్యలో నామినేషన్లు నమోదు కావడం గమనార్హం. మొత్తం మీద మూడు రోజుల పాటు జరిగిన నామినేషన్ల స్వీకరణతో సర్పంచ్ పదవులకు 1,028మంది నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 3,918 మంది నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ గ్రామపంచాయతీలకు 22వ తేదీన అభ్యర్థులకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది.

కాగా ఈ ఎన్నికలు చివరగా 30వ తేదీన జరుగుతాయి. మొత్తం మీద జిల్లాలోని 453 పంచాయతీలకు గాను మూడు విడతలుగా జరిగిన నామినేషన్ల స్వీకరణ ముగియడం గమనార్హం. ఇప్పటికే రెండు విడతల్లో భాగంగా అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ రెండు మండలాల్లో నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారం ఊపందుకుంది. కొల్లాపూర్ అసెంబ్లీతో పాటు నాగర్ మూడు మండలాల్లో సైతం నామినేషన్ల స్వీకరణ పూర్తి కావడం, ఉపసంహరణ మాత్రమే మిగిలి ఉండడంతో జిల్లాలో పంచాయతీ పోరు రసవత్తరంగా సాగనుంది. ఇక తొలి విడతలో 37 పంచాయతీలు ఏకగ్రీవం కాగా రెండో విడతలో 21 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మూడో విడతలో కూడా అదేవిధంగా పంచాయతీలు ఏకగ్రీవం అయ్యే అవకాశం కన్పిస్తుంది. టీఆర్ పార్టీ మద్దతుదారులకు ఈ ఎన్నికల్లో ప్రజల నుంచి ఆదరణ కన్పిస్తుంది. ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10లక్షల నగదు ప్రోత్సాహకం అందిస్తుండడంతో పాటు పార్టీ యంత్రాంగం కూడా కృషి చేస్తుంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ మూడవ విడతలో జరిగే పంచాయతీలపై దృష్టి సారించారు. అదేవిధంగా అచ్చంపేట, కల్వకుర్తి అసెంబ్లీ పరిధిలో ఉన్న టీఆర్ మద్దతు దారులను గెలిపించేందుకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్ చర్యలు తీసుకున్నారు. ప్రజలు సైతం టీఆర్ మద్దతు దారులను గెలిపించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొత్తం మీద మూడవ విడత నామినేషన్లు ముగియడంతో జిల్లా అంతటా పంచాయతీ వాతవరణం ఏర్పడింది.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...