టీఆర్ గ్రామ స్వరాజ్యం


Sat,January 19, 2019 01:59 AM

నాగర్ నమస్తే తెలంగాణ ప్రతినిధి : సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని.. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ మద్దతుదారులను గెలిపించుకోవాలని మాజీ మంత్రి, టీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అబివృద్ధి, సంక్షేమాన్ని ఆదరించిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ పార్టీకి మళ్లీ పట్టం కట్టారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతు, పేదల సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా మారాయన్నారు. ప్రధాని మోడీ సైతం రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించేలా పథకం రూపొందించనున్నారని పేర్కొన్నారు. టీఆర్ పార్టీని ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆదరించాలన్నారు. ముఖ్యంగా గ్రామాలను ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రజలు సన్నద్దం కావాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో దాదాపుగా 70 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయన్నారు. ఏకగ్రీవ పంచాయతిలకు ప్రభుత్వం రూ.10లక్షల ప్రోత్సాహం అందజేస్తుందని, దీని వల్ల గ్రామ పంచాయతీలు అబివృద్ధి చెందుతాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారన్నారు. ఇటీవలే రిటైర్డ్ ఇంజినీయర్ల బృందం కూడా జిల్లాలో పర్యటించి ప్రాజెక్టుల స్థితిగతులపై సీఎంకు నివేదిక అందజేసిందన్నారు. త్వరలో కొల్లాపూర్ చౌరస్తాలో టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్ పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...