‘జన’జాతర..!


Sat,January 19, 2019 01:58 AM

కొల్లాపూర్, నమస్తే తెలంగాణ : మకర సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15నుంచి కొల్లాపూర్ మండలం సింగవట్నం లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం శుక్రవారం సాయంత్రం కన్నుల పండువగా సాగింది. తెలుగు రాష్ర్టాలతోపాటు కర్నాటకల నుంచి తరలివచ్చిన భక్తుల జయజయ ధ్వానా లు, స్వామి నామస్మరణలతో పు ణ్యక్షేత్రం పులకరించిపోయింది. సింగవట్నానికి వెళ్లె దారులన్నీ జనంతో నిండిపోయాయి. రథోత్సవానికి ముం దుగా ఆలయ అర్చకులు ఓరుగంటి సంపత్ నేతృత్వం లో వేదపండితులు ప్రత్యేక పూజ లు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథంపైకి తీసుకురావడంతో భక్తు లు పెద్ద ఎత్తున స్వామివారిని ద ర్శించుకున్నారు. రథోత్సవాన్ని లాగితే దేవుడి కృప పొందిన వారమవుతామన్న భావనతో యువకులు రథాన్ని లాగడానికి పోటీలు పడ్డారు. ఈ రథోత్సవాన్ని తూ ర్పు దిశలో ఉన్న రత్నగిరి కొండ దిగువన ఉన్న జమ్మిచెట్టు చుట్టూ తిరిగి యథాస్థానానికి చేరుకుంది. రథోత్సవానికి వీక్షించేందు కోసం వేలాది మం ది భక్తులు అటు శ్రీవారిసము ద్రం చెరువుగట్టు పొడువునా నిల్చున్నారు. మరి కొం దరు రత్నగిరి కొండపైకి ఎక్కి తిలకించారు. ఈ రథోత్సవంలో అచ్చంపేటకు చెందిన మహిళలు కొలాటలు, వంకేశ్వరం గ్రా మానికి చెందిన యువకులు భజనలు ఆకట్టుకున్నా యి. ఈ ఉత్సవాల్లో ఆలయ వంశ పార్యపరం గా ధర్మకర్త రాజ ఎస్,వీవీకేబీ ఆదిత్య లక్ష్మారావు, తనయు డు రాంగోపాల్ స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ దంపతులు, గద్వాల మాజీ ఎమ్మెల్యే డీకే అరుణలు పాల్గొన్నారు. అంతకుముందు వారు రత్నలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజ లు చేశారు. నాగర్ డీఎస్పీ లక్ష్మీనారాయ ణ, స్థానిక సీఐ శ్రీరాంసైదాబాబు నేతృత్వంలో సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్సై లు జీవీ సత్యనారాయణ, భాగ్యలక్ష్మీరెడ్డి, పోచయ్య, నరేష్, వీపనగండ్ల, పాన్ ల్, ఎస్సైల ఆధ్వర్యంలో భారీ బందోబ స్తు నిర్వహించారు. కార్యక్రమంలోవివిధ పార్టీల నాయకులు రంగినేని జగదీశ్వరుడు, రత్నప్రభాకర్ కాటం జంబులయ్య, రామచందర్, కందాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...