మయూరికి జాతీయ స్థాయి గుర్తింపు


Sat,January 19, 2019 01:58 AM

మహబూబ్ నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మయూరీ నర్సరీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. మూడున్నర సంవత్సరాల కాలంలో అనూహ్యమైన రీతిలో పలు సౌకర్యాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ర్టాల్లోనూ గుర్తింపు పొందింది. ఇటీవల నర్సరీలో అతిథి గుడారాల ఏర్పాటు, రెయిన్ ఫారెస్ట్, వాటర్ ఏర్పా ట్లు కావడంతో నర్సరీకి సంబంధించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ విష యం తెలుసుకున్న కేంద్ర అటవీశాఖ డైరెక్టర్ జనరల్ సిద్ధాంతదాస్ మయూరీ నర్సరీని సందర్శించేందుకు ఆసక్తిని కనబర్చారు. ఆ విషయాన్ని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్వేటర్ ఆఫ్ పారెస్ట్ పీకేజాకు తెలియజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ సమాచారం ఇవ్వడంతో శుక్రవారం మయూరీ నర్సరీని సందర్శించే విధంగా వారు ఏర్పా ట్లు చేశారు. ఈ మేరకు కేంద్ర అటవీశాఖ డైరెక్టర్ ఆఫ్ జనరల్ సిద్ధాంతదాస్ తన సిబ్బందితో ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాదుకు చేరుకొని హెలిక్యాప్టర్ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు, సీఎం కా ర్యాలయ ఓఎస్ ప్రియాంక వర్గీస్ కలిసి హెలిక్యాప్టర్ ద్వారా జడ్చర్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాలలో సాయంత్రం 4:40 గంటల ప్రాంతంలో నర్సరీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ తదితరులు వారికి ఘన స్వాగతం పలికారు.

నర్సరీలో ఏర్పాటు చేసిన అంశాలను కాలినడక ద్వారా ప్రత్యేకంగా పరిశీలించారు. హంసల దీవి, అతిథి గుడారాలు, పార్కులు, పిల్లలకు ఏర్పాటు చేసిన ఆట వసతులు, రోప్ తదితర అంశాలను ఎమ్మెల్యే శ్రీనివాస్ తదితరులతో కలిసి పరిశీలించారు. అనంతరం రెయిన్ ఫారెస్ట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ కలెక్టర్ రొనాల్డ్ నర్సరీ సందర్శనకు వచ్చిన అతిథులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెయిన్ ఫారెస్ట్ మొక్క లు నాటారు. అనంతరం ప్రత్యేక రెయిన్ ద్వారా కృత్రిమ వర్షం కురవడాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ ఏర్పాట్లను గురించి కలెక్టర్ అధికారులకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ కలిసి అధికారులు వాటర్ ప్రత్యేకంగా పరిశీలించారు. చివరలో అతిథిగా గుడారాలను పరిశీలించి కొంత సేపు ఎమ్మె ల్యే, కలెక్టర్, తదితర అధికారులతో కలిసి మాట్లాడారు. మయూరీ నర్సరీని అభివృద్ధి పర్చేందుకు రూ.30 కోట్లను కేటాయించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ విజ్ఞప్తి చేయగా, రీసోర్స్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ కేంద్ర అటవీశాఖ డైరెక్టర్ ఆఫ్ జనరల్ విజ్ఞప్తి చేశారు. ఇంత త్వరిత గతిన మయూరీ నర్సరీని అభివృద్ధిని పర్చడం పట్ల అటవీశాఖ డైరెక్టర్ జనరల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నర్సరీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా రూపొందిస్తాం : శ్రీనివాస్
కేంద్ర, రాష్ట్ర అటవీశాఖ అధికారులు నర్సరీని సందర్శించి వెళ్లిన అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. మూడున్నర సంవత్సరాల కా లంలో నర్సరీని రాష్ట్రంలోనే అత్యుత్తమ పర్యాటక స్థలాలలో ఒకటిగా రూపొందించాం. మరిన్ని సౌకర్యాలను కల్పించి అంతర్జాతీయ స్థాయిలో పాలమూరు జిల్లాకు గుర్తింపు లభించేలా ఈ నర్సరీని రూపొందిస్తామని వివరించారు. పాలమూరు అంటే కరువు కాటకాలకు కాదు, అభివృద్ధికి మారుపేరు అన్నట్లుగా రూపొందిస్తామని శ్రీనివాస్ వెల్లడించారు. కార్యక్రమంలో డీఎఫ్ గంగారెడ్డి, సింగిల్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, టీఆర్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్, ఆనంద్ పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...