రెండో వడత బరిలో 451


Fri,January 18, 2019 01:31 AM

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీలోని కల్వకుర్తి, వెల్దండతో పాటుగా రంగారెడ్డి జిల్లా పరిధిలోనికి వచ్చే ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాలు, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ పరిధిలోని తాడూరు, తెలకపల్లి మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ కిందకు వచ్చే ఊర్కొండ మండలాలకు ఈనెల 25వ తేదీన గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతాయి. ఇందుకోసం సర్పంచ్ పదవులకు 679నామినేషన్లు, వార్డు సభ్యులకు 2529నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నామినేషన్లకు ఉపసంహరణ గురువారం ముగిసింది. ఇందులో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు వందలాది మంది నామినేషన్లు సంహరించుకోవడం జరిగింది. ఇక నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని ఆరు మండలాలకు గాను 19గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో రెండో విడతలో మొత్తం 122గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.

తెలకపల్లిలో అత్యధికంగా సర్పంచ్‌కు 149మంది అభ్యర్థులు పోటీలో ఉండటం గమనార్హం. మొత్తం మీద రెండో విడత ఉపసంహరణ జరగడం, బరిలో ఉన్న అభ్యర్థులపై స్పష్టత రావడంతో ఈనెల 25వ తేదీన ఎన్నికలు జరగనుండటంతో అభ్యర్థులు పోటాపోటీ ప్రచారాలు చేపట్టనున్నారు.టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపుతో తమ గ్రామాల్లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందనే భావనలో ప్రజలు ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, మాజీ మంత్రి లకా్ష్మరెడ్డిలు టీఆర్‌ఎస్ మద్దతుదారుల గెలుపు కోసం పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. ఇలా మొదటి విడతలోని అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంతో పాటుగా కల్వకుర్తి అసెంబ్లీ, నాగర్‌కర్నూల్, జడ్చర్లలోనూ పంచాయతీ పోరు కాక రేపుతోంది. ఉపసంహరణ ముగిశాక సర్పంచ్ పదవులకు. 388మంది, వార్డు సభ్యులకు 2వేల మందికిపైగా అభ్యర్థులు బరిలో నిలవనున్నారు.

ఏకగ్రీవ పంచాయతీలు
జిల్లాలో మొత్తం 20 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వెల్దండ మండలంలో కేశ్లితండా,శంకరకొండ తండా, ఎంజీ కాలనీ తండా, సిలోనిబావితండా నారాయణపూర్ తండా, కల్వకుర్తి మండలంలో వెంకటాపూర్ తండా, తర్నికల్ తండా లింగసానిపల్లి, తుర్కలపల్లి, ఊర్కొండ మండలంలో బాల్యలోక్య తండా, చారకొండ మండలంలో గైరాన్‌తండా, రాంచంద్ర తండా, శాంతిగూడెం, కమలాపూర్ తండా, శేరిఅప్పారెడ్డిపల్లి, మర్రిపల్లి తండా, తాడూరు మండలంలో లచ్చిరాంతండా, అంతారం, తెలకపల్లి మండలంలో రాంరెడ్డిపల్లి చిన్నముద్దునూర్ గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...