వెల్లువలా..


Fri,January 18, 2019 01:30 AM

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుది. మొదటి రోజైన బుధవారం కీడు దినంగా భావించిన అభ్యర్థులు అంతంత మాత్రంగానే నామినేషన్లు దాఖలు చేయగా గురువారం భారీ సంఖ్యలో వేయడం గమనార్హం. మొదటి రోజు 152గ్రామ పంచాయతీలకు గాను సర్పంచ్ పదవులకు 47, 1,240 వార్డు సభ్యుల పదవులకు 62నామినేషన్లు మాత్రమే వచ్చాయి. రెండో రోజు మాత్రం సర్పంచ్ పదవులకు 267, వార్డు పదవులకు 964చొప్పున నామినేష్లు రాగా మొత్తం రెండు రోజుల్లో సర్పంచ్‌లకు 314నామినేషన్లు వార్డు పదవులకు 1,026నామినేషన్లు అయ్యాయి. శుక్రవారం చివరి రోజు కావడంతో ఇంకా వందల సంఖ్యలోనే దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కొల్లాపూర్‌లోని మిగతా మండలాలైన వీపనగండ్ల, చిన్నంబావి, పాన్‌గల్ మండలాల ఎన్నికలు వనపర్తి జిల్లా అధికారుల పర్యవేక్షణలో జరగన్న్నుయి. కొల్లాపూర్, కోడేరు, పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి మండలాలతో పాటుగా నాగర్‌కర్నూల్ అసెంబ్లీలోని బిజినేపల్లి, తిమ్మాజిపేట, నాగర్‌కర్నూల్ మండలాలకు నామినేషన్ల స్వీకరణ జరుగుతోంది.

ఇదిలా ఉండగా బిజినేపల్లి మండలంలో సర్పంచ్ పదవికి అత్యధికంగా 18నామినేషన్లు, వార్డు సభ్యులకూ అదే విధంగా 313నామినేష్లు వచ్చాయి. అత్యల్పంగా సర్పంచ్ పదవులకు పెంట్లవెల్లిలో 26మంది, వార్డు సభ్యులకూ 60మంది మాత్రమే నామినేషన్లు వేయడం జరిగింది. మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ ఈనెల 20న జరుగుతుంది. ఎన్నికలు ఈనెల 30వ తేదీన చివరగా జరుగుతాయి. ఈ ఎన్నికలను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. అత్యధిక గ్రామాలు టీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలవాలని పార్టీ శ్రేణులకు సూచించడంతో ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం రూ.10లక్షల పారితోషికం ప్రకటించడంతో ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాల కోసం ముందుకు కదులుతున్నారు. మొదటి విడతలో 37పంచాయతీలు ఏకగ్రీవం కాగా, రెండో విడతలో 20పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అదే జోరును కొనసాగించేలా టీఆర్‌ఎస్ నేతలు ఉత్సాహంతో ఉన్నారు. మూడో విడత నామినేషన్ల పర్వం ముగియనుండటం, గుర్తుల కేటాయింపు త్వరలో జరగనుండటంతో ఇక జిల్లా అంతటా పంచాయతీ ఎన్నికల వాతావరణం కమ్ముకోనుంది.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...