వేర్వేరు ప్రమాదాల్లో పలువురి గాయాలు


Fri,January 18, 2019 01:30 AM

అయిజ : మెదక్ జిల్లాలోని కొల్చా రం మండల శివారులో బుధవారం తెల్లవారు జామున ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఐదు మందికి గాయాలయ్యా యి. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అయిజ పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన 80 మంది మెదక్ చర్చి చూసేందుకు అ యిజలోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు లు రెండింటిని మాట్లాడుకుని ఒక్కో బస్సులో 40 మంది చొప్పున 80 మంది బుధవారం రాత్రి బయలు దేరారు. గురువారం తెల్లవారు జా మున మెదక్ జిల్లా, కొల్చారం శివారులో ఓ వాహనాన్ని తప్పించ బోయిన ఓ బస్సు రోడ్డు పక్కకు దూసుకుపోయి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న 40 మందిలో 5 మందికి బలమైన గాయాలు కాగా, కొందరికి స్వల్పగాయాలు అయ్యాయి. మరో బస్సు సురక్షితంగా మెదక్ చర్చికి వెళ్లినట్లు తెలిపారు. గాయాలైన క్షతగాత్రులను హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించి చికిత్స అందించినట్లు బాధి త కుటుంబసభ్యులు పేర్కొన్నారు. గు రువారం గాంధీ దవాఖానలో చికిత్స అందించి అయిజకు తరలిస్తున్నట్లు బాధిత కుటుంబాలు తెలిపాయి. గా యపడిన వారిలో అఖిలప్రియ, బజారమ్మ, సుగుణమ్మ, తిప్పమ్మ, మేఘన తదితరులు ఉన్నారు. బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. కేవ లం గాయాలు కావడం తో ఊపిరి పీ ల్చుకున్నారు. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో బాధితులు చలికి అక్కడే వేచి ఉన్నట్లు పేర్కొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...