వేటగాడి ఉచ్చులో వన్యప్రాణి హతం


Fri,January 18, 2019 01:30 AM

కొల్లాపూర్, నమస్తే తెలంగాణ : నల్లమల అడవిలోని సోమశిల అటవీ ప్రాంతంలో ఓ వేటగాడు వేసిన ఉచ్చులో ఓ వన్యప్రాణి హతం అయ్యింది. ఆ అడవిలోనే మాంసాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో వెంటనే కొల్లాపూర్ అటవీశాఖ అధికారులు గురువారం మూక్కుమ్మడిగా దాడి చేసి నిందితుడితో పాటు 4కిలోల మాంసం, 100కు పైగా ఉచ్చులు, ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఫారెస్టు రేంజర్ సీ మనోహర్ వెల్లడించారు. మండలంలోని సోమశిల గ్రామానికి చెందిన బోయ శ్రీనివాసులు (45)అనే వ్యక్తి సమీపంలోని నల్లమల అడవిలో వన్యప్రాణులను హతమార్చుట కోసం బైక్ క్లచ్ వైర్లతో తయారు చేసిన ఉచ్చును వేశాడు. ఆ ఉచ్చులో ఓ వన్యప్రాణి చిక్కుకొని ప్రాణాలు విడిచింది. అక్కడికి సమీపంలోనే సదరు అడవి జంతువును ముక్కలు ముక్కలుగా చేస్తుండగా సమాచా రం అందుకున్న ఎఫ్‌ఆర్వో మనోహర్ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడి నుంచి 100కు పైగా క్లచ్ వైర్లతో తయారు చేసిన ఉచ్చు, 4కిలోల మాంసం, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే వేటగాడి ఉచ్చులో హతమైంది కొండ గొర్రెనా? లేక చుక్కల దుప్పినా అన్నది పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడికానున్నది. అయితే తాము స్వాధీనం చేసుకున్న మాంసాన్ని పోస్టుమార్టం చేయించేందుకు అందుబాటులో వెటర్నరీ డాక్టర్ లేనందున శుక్రవారానికి పోస్టుమార్టం వాయిదా వేసినట్లు వివరించారు. ప్రస్తుతం లభించిన ఆధారాల ప్రకారం.. నిందితుడు బోయ శ్రీనివాసులుపై వన్యప్రాణుల సెక్షన్ 9 కింద కేసు నమోదు చేసి దర్యా ప్తు జరుపుతున్నట్లు ఎఫ్‌ఆర్వో మనోహర్ స్పష్టం చేశారు. ఈ దాడిలో పారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు కాశన్న, బషీర్, బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఉన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...