కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు


Fri,January 18, 2019 01:30 AM

అచ్చంపేట, నమస్తే తెలంగాణ : నల్లమలలోని కొండపై వెలసిన ఉమామహేశ్వరంలో బుధవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. కొండ కింద రంగాపూర్ నిరంజన్‌షావలీ దర్గా ఉత్సవాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలో జాతర ఉత్సవాలు అంబరాన్నంటాయి. రెండు ఉత్సవాలు ఒకేసారి రావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకోనున్నారు. ఉమామహేశ్వరంలో వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. స్వామి వార్లకు అంకురార్పణ, ధ్వజారోహణతో వేడుకలు ప్రారంభమయ్యాయి. బ్రహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొండ కింది నుంచి కొం డపైకి ప్రత్యేక బస్సులు సౌకర్యం కల్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ కందూరి సుధాకర్ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు,ప్రాతరౌపాసన,మంత్రపుష్పం,అశ్వవాహ నం,గవ్యాంతపూజ,అమ్మవారికిఅభిషేకం,రుద్రహోమం తదితర పూజలు చేశారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...