గ్రామ పంచాయతీల పంట పండింది


Fri,January 18, 2019 01:29 AM

తిమ్మాజిపేట : గ్రామ పంచాయతీ ఎన్నికలతో ఏళ్ల కోలది పేరుక పోయిన టాక్స్‌లన్నీ వసూలు అవుతున్నాయి. సర్పంచ్‌లు, వార్డు స్థానాలకు పోటీ చేసే వారందరూ గ్రామ పంచాయతీలలో ఎలాంటి బకాయిలు ఉండరాద న్న నిబంధనల కారణంగా ఆశావాహులంతా తమ ట్యాక్స్‌లంతా స్వచ్ఛందం గా వచ్చి చెల్లిస్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న కార్యదర్శులు పేరుకపోయిన టాక్స్‌లన్నీ వసూలు చేస్తున్నారు. అభ్యర్థులతో పాటు, ప్రతిపాదించేవారు టాక్స్‌లు చెల్లించాలన్న కారణంగా భారీగా టాక్స్‌లు వసూలు అవుతున్నాయి. తిమ్మాజిపేట మండలంలో 26 గ్రామ పంచాయతీలలో గత రెండు రోజులుగా అక్షరాల రూ.3 లక్షలు వసూలయ్యాయి. దీంతో గ్రామ పంచాయతీల పంట పండుతుంది. మండల కేంద్రం తిమ్మాజిపేటలో అత్యధికంగా రూ.52,640 వసూలు కాగా, బుద్దసముద్రంలో రూ.30,869లు వసూలయ్యాయి. గొరిట, గుమ్మకొండలలో రూ.20వేలకు పైగా వసూలయ్యాయి. కొత్తగా గ్రామ పంచాయతీగా ఏర్పడిన లకా్ష్మనాయక్ తండాలో రూ.2,100 మాత్రమే వసూలయ్యాయి. శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో మరింత టాక్స్ వసూలు అయ్యే అవకాశం ఉన్నది.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...