కల్యాణం కమనీయం


Thu,January 17, 2019 02:50 AM

అచ్చంపేట, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధ్దిగాంచిన ఉమామహేశ్వర క్షేత్రంలోని పార్వతీపరమేశ్వరుల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఆలయ క్షేత్రంలోని కొండకింద బోగమహేశ్వరంలోని కల్యాణ మండపంలో దేవుడి కల్యాణం కమనీయంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని అచ్చంపేట, పెనిమిళ్ల, రంగాపూర్, అమ్రాబాద్, మన్ననూర్, నడింపల్లి, బల్మూర్, పదర, ఉప్పునుంతల నుంచి ప్రభోత్సవాలు కొండ కింద ఉన్న బోగమహేశ్వరానికి మంగళవారం రాత్రి వరకు చేరుకున్నాయి. అనంతరం రాత్రి 2 గంటలకు కొండపై నుంచి స్వామివార్లను మంగళవాయిద్యాలతో పాపనాశనం వద్ద గంగాజలం తీసుకొని ఊరేగింపుతో పల్లకీసేవ ద్వారా కొండకిందకు తీసుకొచ్చారు. కల్యాణ మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించి స్వామివార్ల కల్యాణాన్ని నిర్వహించారు. పార్వతీపరమేశ్వరులకు స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు ప్రభుత్వం తరుపున పట్టువస్ర్తాలు సమర్పించారు. అంతేకాకుండా రూ.5లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు సమర్పించారు.

ముత్యాల పందిరిలో పరమేశ్వరుడు, ఉమాదేవికి తాళిబొట్టు కట్టడం చూసి భక్తులు తరించిపోయారు. భక్తులు, ప్రభోత్సవాల నిర్వాహకులు, ఆలయ అధికారులు తెచ్చిన తలంబ్రాలను ఓక చొట చేర్చి స్వామివార్లకు సమర్పించారు. అచ్చంపేట పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ప్రభోత్సవం నిర్వాహకులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు, పండితులు వీరయ్యశాస్త్రీ, గోపిశర్మ, రవిశర్మ, నీలకంఠం, కృష్ణమూర్తిశర్మ, రవికుమార్‌శర్మ, రాజ్‌కుమార్‌శర్మలు కల్యాణం జరిపించారు. భక్తులు చలిని లెక్క చేయకుండా తెల్లవారుజామున జరిగిన స్వామివార్ల కల్యాణాన్ని కనులారా విక్షించి తన్మయత్వం పొందారు. అర్చకులు, పండితుల వేదమంత్రోచ్చరణాలతో నల్లమల ఉమామహేశ్వర క్షేత్రం మార్మోగింది. ఆలయ కమిటీ చైర్మన్ కందూరి సుధాకర్ ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. పక్కనే ఉన్న అగ్ని గుండంలో భక్తులు నిప్పులపై నడిచారు. క్షేత్రంలో దేవుడి కల్యాణం అత్యంత వైభవంగా జరగడంతో భక్తులు చూసి తరించారు. అచ్చంపేట ఎస్‌ఐ పరుశురాం ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ అధికారి శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహగౌడ్, రైతు సమితి మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శాంతలోక్యనాయక్, భ్రమరాంబ ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, వైస్‌ఎంపీపీ సంబుశోభ, శివ, హుస్సేన్, నాగరాజు భక్తులు పాల్గొన్నారు.

నందిసేవపై ఊరేగిన స్వామివార్లు..
పరమేశ్వరుడు, ఉమాదేవికి కల్యాణం జరిగిన అనంతరం సాయంత్రం స్వామివార్లకు నందిసేవ నిర్వహించారు. కొండపైకి తీసుకెళ్లి పాపనాశనానికి ఊరేగింపుతో మంగళవాయిద్యాల నడుమ తీసుకెళ్లి గంగాజలం తీసుకొని ప్రత్యేక పూజల అనంతరం స్వామివార్లను గర్భగుడికి తరలించారు. నందిసేవను భక్తులు చూసి తన్మయత్వం పొందారు.

ఎత్తం గట్టుకు పోటెత్తిన భక్తులు
కోడేరు : మండలంలోని ఎత్తం గట్టుపై వెలసి న రామలింగేశ్వరస్వామి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సందర్భంగా రామలింగే శ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించారు. తెలుగు రాష్ర్టాలనుంచి భ క్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల 13న ప్రారంభమైన ఉత్సవాలు 16సాయం త్రం ముగిశాయి. గట్టు కింద ఆం జనేయస్వామి ఆలయంలో ఆకుపూజ, హోమం వివిధ రకా ల పూజలు నిర్వహించారు.

భక్తులకు అన్నదానం..
కోడేరు, ఎత్తం, మహాసము ద్రం గ్రామాలకు చెందిన భక్తులు అన్నదానం చేశారు. కోడేరు సురే ష్ జగన్ సోదరులు కోడేరు ముఖద్వారం వైపునుంచి వెళ్లే భక్తులకు అన్నదానం చేశారు. ఎత్తం మహాసముద్రం, వివిధ గ్రామాలకు చెందిన వారు కూడా అన్నదానం, తాగునీటి వసతిని కల్పించారు. ఈ ఏడాది గట్టు పరిసర ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేసి భక్తులకు తినుబండారాలు విక్రయించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...