చేరికల జోరు


Thu,January 17, 2019 02:49 AM

కొల్లాపూర్, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్‌లోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. కొల్లాపూర్ మండలం చింతలపల్లి గ్రామ ఎంపీటీసీ పల్లె సుజాతమ్మ, ఆమె భర్త కాంగ్రెస్ నాయకుడు పల్లె సోమన్‌గౌడ్ ఆధ్వర్యంలో 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం మాజీ మంత్రి జూపల్లి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి గులాబీ కండువాలను కప్పి జూపల్లి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పల్లె సీమలాభివృద్ధి జరగాలంటే గ్రామపంచాయతీల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులనే గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు బిచ్చారావు, ఎ.రాజశేఖర్‌రావు, ఎం.వెంకట్‌రావు, మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మర్రి సమక్షంలో..
తిమ్మాజిపేట : తిమ్మాజిపేట మండలం పుల్లగిరికి చెందిన నాగం ముఖ్య అనుచరుడు, కాంగ్రెస్ నాయకుడు హర్యానాయక్ బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా గులాబీ కండువాతో ఎమ్మెల్యే స్వాగతం పలికారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు 10 మందికి పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు జెట్టి వెంకటేశ్, మార్కెట్ డైరక్టర్ హుస్సేని, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గువ్వల సమక్షంలో..
ఉప్పునుంతల/బల్మూరు/లింగాల : మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ సైదమ్మ రాంచంద్రం, యువ నాయకుడు పర్వత్‌రెడ్డిలతో పాటు 50 మంది నాయకులు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు ఎంపీపీ అరుణ, నర్సింహరెడ్డి, బాలయ్య, గోపాల్‌రెడ్డి, వెంకటయ్య, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

బల్మూరు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారిలో శ్రీను, మల్లేశ్, రాములు, బాలస్వామి, లక్ష్మయ్యతో పాటు మరో 10మంది చేరారు.

లింగాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ ఎత్తున ఎమ్మెల్యే గువ్వల సమక్ష్యంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరికి గువ్వల కండువాలను కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నల్లగొండ పెంటయ్య, శశిధర్, రమేశ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు మాకం తిరుపతయ్య, కేటీ తిరుపతయ్య, కోనేటి తిరుపతయ్య, రానోజీ, శ్రీనివాసులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...