పంచాయతీలో విజయఢంకా మోగిస్తాం


Thu,January 17, 2019 02:48 AM

పాన్‌గల్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక సంఖ్యలో గెలిపించుకొని విజయఢంకా మోగిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు కలసికట్టుగా పనిచేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకుందామన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రజాసంక్షేమ పథకాలను కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ముమ్మరంగా ప్రచారం చేపట్టాలన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో.. ఆ పార్టీకి చెందిన సర్పంచులనే ఎన్నుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం గ్రామంలోని అన్నారం గ్రామంలో కాంగ్రెస్‌కు చెందిన దాదాపు 150మంది కార్యకర్తలు మాజీ మంత్రి జూపల్లి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు కిష్టాపూర్‌కు చెందిన శ్రీనివాసులు(29) బుధవారం గుండెపోటుతో మృతి చెందడంతో జూపల్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటేశ్‌నాయుడు, జెడ్పీటీసీ రవికుమార్, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యుడు తిరుపతయ్యసాగర్, మాజీ సర్పంచు మహేశ్, నాయకులు చంద్రశేఖర్‌నాయక్, వీరసాగర్, శ్రీధర్‌శెట్టి, వెంకటయ్యగౌడ్, కురుమూర్తి, మేస్త్రీ రాములు, శివుడు, కృష్ణయ్య, శ్రీనివాసులు, రాములు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...