గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి


Thu,January 17, 2019 02:48 AM

- అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట, నమస్తే తెలంగాణ : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని.. పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులను గెలిపించుకొని గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం అచ్చంపేట మండలంలోని రంగాపూర్, దర్గాతాండలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రంగాపూర్, దర్గాతాండలో టీఆర్‌ఎస్ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులు లోక్య, గిరిజన మహిళ లాలిని వార్డు సభ్యులను గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలని అన్నారు. గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వంలో కొనసాగుతుందన్నారు. అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తేనే అభివృద్ది మరింత వేగవంతమౌతుందన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పలు వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ వార్డు సభ్యులకు మద్దతుగా ప్రచారం చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమితి అధ్యక్షుడు పోకల మనోహర్, జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహగౌడ్, మండల రైతు సమితి అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తులసీరాం, గ్రామస్తులు లోక్యనాయక్, హాతిరాం, రవి, రుమాల, ఈదమయ్య, నిరంజన్, వెంకటయ్య, లక్ష్మన్, సోమ్లా తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...