కందనూలుకు ఉత్సవ శోభ


Tue,January 15, 2019 05:45 AM

అచ్చంపేట రూరల్ : నల్లమల కొండల్లో ఏపుగా పెరిగిన చెట్లు.. ఆ చెట్లపై పక్షుల కిలకిలరావాలు.. ఎత్తైన కొండలు.. జాలువారే జలపాతాలు.. సమీపంలోనే కృష్ణానది అందాలతో అక్కడక్కడ అటవీ జంతువులతో ప్రకృతి రమణీయ దృశ్యాలు కనివిందు చేస్తు పర్యాటకులను పరవశింపజేస్తాయి. భారతదేశంలోని హిమాలయాల తర్వాత దక్షిణ భారతీ యులు అతి పవిత్రంగా భావించే కొండలు నల్లమ కొండలు. ఈ కొండల్లో 500 అడుగుల ఎత్తున కొలువైనదే ఉమా మహేశ్వర క్ష్రేతం. ఇది శ్రీశైల ఉత్తర ధ్వారముగా పేరు గాంచింది. శ్రీరాముడు రావణసుర వధానంతరము శ్రీశైల ప్రదక్షిణము ఈ క్షేత్రము నుండే ప్రారంభించినట్లు శ్రీశైల పురాణం చెబుతుంది. ఉమామహేశ్వర క్షేత్రం పవిత్ర ప్రసిద్ధ క్షేత్రమైన రెండో శ్రీశైలముగా పిలవబడుతోంది. కాకతీయుల కాలంలో ఈ క్షేత్రము మహా వైభవముగా ఉన్నట్లు పండితారాధ్య చరిత్ర చూస్తే తెలుస్తున్న ది. పండితారాధ్యుని శిష్యుడు దోనయ్య ఈ దారినే శ్రీశైలమునకు వెళ్లినట్లు చెబుతారు. అప్పుడు ఉమామహేశ్వరము ఒక(పురము) ఊరు గానే ఉన్నట్లు అప్పటి శిలా శాసనములను బట్టి తెలుస్తోంది. గణపతి దేవుడు రాజ్యం పాలించునప్పుడు క్రీ.శ. 1235వ సంవత్సరమున భీమ చోడుడు పర్వతోత్తరం ద్వారా శ్రేష్ట ఉమామహేశ్వరస్వామి వారికి అంగరంగ భోగాల కోసం అంకమపల్లె గ్రామదానం చేసి శాసనం చెక్కించారు. గణపతి దేవుని కాలంలో అమ్రాబాద్ ప్రాంతాన్ని చెరుకు బోలయరెడ్డి అనే అమర నాయకుడు పాలించడం జరిగిందని ప్రాశస్త్యి.

భోగమహేశ్వరం
ఉమామహేశ్వరం కొండ కింద స్థలానికి భోగ మహేశ్వరం అని పేరు. పూర్వం యాత్రికులు కొండపైకి వెళ్లి స్వామి వారిని దర్శించుకొని తిరిగి కొండ కిందకు వచ్చి వంటలు చేసుకునేవారు. అప్పుడు ఇక్కడ ఒక గ్రామము కూడా ఉండేది. కానీ కాలక్రమంలో ఆ గ్రామం కనుమరుగైంది. క్రీ.శ.1280 లో కరణం రామయ్య భోగ మహేశ్వరములో కాకతీయ రుద్రమదేవి పేర చలమర్తి గండరుద్రేశ్వర ప్రతిష్ఠ చేశారు. అప్పుడాయన భార్యలు మల్లసాని అమరనాథ దేవర, చెన్న సోమనాథ దేవర, చెన్న మల్లనాథ, సోమేశ్వర దేవరల పేర 5 గదులు నిర్మించి లింగ ప్రతిష్ఠ చేయించాడు. నేడు ఆ ద్వారాలు శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన దేవాలయ నిర్మాణం, విగ్రహాల (లింగాలు)ను ప్రతిష్ఠించేందుకు పనులు సాగుతున్నాయి.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...