ముగిసిన నామినేషన్ల తిరస్కరణ పర్వం


Tue,January 15, 2019 05:41 AM

కల్వకుర్తి, నమస్తే తెలంగాణ : జిల్లాలో పంచాయితీ ఎన్నికలలో భాగంగా రెండో విడతకు నామినేషన్ల పర్వం ముగిసింది. జిల్లాలో 10 మండలాలల్లోని 243గ్రామ పంచాయి తీ సర్పంచ్ స్థానాలకు, 2153 వార్డు స్థానాలకు దాఖలు చే సిన నామినేషన్లను సోమవారం అధికారులు పరిశీలించా రు. సమగ్ర సమాచారం లేని నామినేషన్లను తిరస్కరించా రు. 10 మండలాలలోని గ్రామ సర్పంచ్‌లకు 1394 నామినేషన్లు, వార్డు స్థానాలకు 5415 సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. అందులో సర్పంచ్ స్థానాలకు దాఖలు చేసిన నామినేషన్లలో 171, వార్డు స్థానాలకు దాఖలు చేసిన నామినేషన్లలో 237లను అధికారులు తిరస్కరించారు. రెండో విడతలో 23 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి.

ఇవీ ఏకగ్రీవ పంచాయతీలు
చారకొండ మండలంలో ఏకగ్రీవ తీర్మాణ గ్రామాలుః గైరాన్‌తండా, రామచంద్రాపురం, శాంతిగూడెం, కమాల్‌పూర్ తండా, షేరి అప్పారెడ్డిపల్లి, కల్వకుర్తి మండలంలో వెంకటాపూర్ తండా, తర్నికల్ తండా, లింగసానిపల్లి, వె ల్దండ మండలంలో శంకర్‌కొండ తండా, కేస్లీ తండా, ఆమనగల్లు మండలంలో కొత్తకుంట తండా, కడ్తాల్ మండలం లో పల్కె చెల్క తండా, బాలాజీనగర్, నార్లకుంట తండా, తలకొండపల్లి మండలంలో వెల్జాల్,వెంకటాపూర తం డా,కోరింతకుంట తండా,పడమటితండా,బల్సులపల్లి తం డా, మాడ్గుల మండలంలో పల్లెతండా , కాశి గూడెం, తా డూరు మండలంలో లచ్చిరాం తండాలు తెలకపల్లి మండలంలో రాంరెడ్డిపల్లి గ్రామం ఏకగ్రీవమైంది.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...