వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి


Tue,January 15, 2019 05:40 AM

-డీసీఎం, బైక్ ఢీకొని ఒకరు.. స్తంభాన్ని ఢీకొని మరొకరు..
కోస్గి టౌన్ : డీసీఎం, బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణ శివారులోని సయ్యద్ పహడ్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, బా ధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సా యత్రం కోస్గి ప ట్టణం నుంచి సర్యాఖాన్ వైపు గోవర్ధన్ (32) బైక్‌పై సయ్యద్‌పహడ్ దర్గా దాటి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో గోవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వాహన చోదకులు గుర్తించి పోలీ సులకు సమాచారం అందించారు. పోలీసులు ఘ టనా స్థలానికి చేరు కొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్ర భుత్వ దవాఖానకు తరలించారు. మృతుడు పట్టణంలోని పూర్వ వెంక టేశ్వర థియేటర్ దగ్గర సోడా అమ్ముకుంటు గత పదిహేనేళ్లుగా వరం గల్లు జిల్లా నుంచి వలస వచ్చి కోస్గి పట్టణంలో తల్లి, భార్య సుశ్మితతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఆయన కు ఓ పాప కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే కుటుం బ సభ్యులు ఈ మధ్యే స్వగ్రామానికి వెళ్లారు. వారికి సమాచారం అందించి కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై విఠల్‌రెడ్డి వెల్లడించారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...