హత్యాయత్నానికి పాతకక్షలే కారణం


Tue,January 15, 2019 05:40 AM

మహబూబ్‌నగర్ క్రైం : పాత కక్ష్యలే కారణంగా ఆశప్పను హత్యచేసేందుకు కుట్ర పన్నిన కేసును ఛేదించి పోలీసులు 15 మంది నిందితులలో, 12 మందిని పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రెమారాజేశ్వరి తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నెల 9వ తేదీన మరికల్‌లో నారాయణపేట మండలం అంబగాపూర్‌కు చెందిన జక్కంగారి ఆశప్ప అలియాస్ అశోక్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లుతో హత్యాయత్నానికి పాల్పడినట్లు చిన్నాన్న కూతరు వర్ష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. అభంగాపూర్‌లో ఆశప్ప, అదే గ్రామానికి చెందిన బుర్జుకేడి విజయ్‌కుమార్‌కు మధ్యలో గత కోన్నెళ్ళ నుంచి భూవివాదంలో గొడవలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో 1999 సంవత్సరంలో ఆశప్ప, విజయ్‌కుమా ర్ ఇంటిపై బాంబుతో దాడి చేశా డు. ఈ ఘటనలో విజ య్‌కుమార్ కుటుంబ సభ్యులకు గాయాలు అ య్యాయి. ఈ కేసులో ఆశప్పపై బాంబు దాడి కేసు న మోదు చేసి పోలీసులు జైలుకు తరలించారు. ఆ తర్వాత 2004లో రెండు కు టుంబ సభ్యుల మధ్యన మరోసారి గొడవలు జరిగాయన్నారు. ఈ క్ర మంలో విజయ్‌కుమార్ అభంగాపూర్ వదిలి కొన్నేళ్లు బయటకు వె ళ్లాడు.

అప్పటినుంచి విజయ్‌కుమార్ తన కుటుంబంలో ఉన్న వారిని హత్య చేసిన ఆశప్పను ఎ లాగైనా హత్య చేయాలని, జైలులో పరిచయమైన కొంత మంది వ్యక్తులతో కలసి ఆశప్పను చంపాలని పథకం పన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి విజయ్‌కుమార్ కుటుంబ సభ్యులు చ ర్చించుకుటుండగానే హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆశప్ప అ భంగాపూర్‌కు వచ్చాడు. ఈ పంచాయతీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు ఆశప్పను హత్యచేసేందుకు కుట్రపన్నారు. 9వ తేదీన ఆశప్ప హైదరాబాద్ నుంచి ఆభంగపట్నం గ్రామానికి వచ్చాడని తెలుసుకుని విజయ్‌కుమార్ కొంత మంది వ్యక్తులతో ఆశప్పను అనుసరించారు. హత్య చేసేందుకు సిదా ర్థ, ప్రశాంత్, శ్రావణ్ గౌడ్, మణికాంత్, జగన్‌గౌడ్‌లు ఆశప్ప కదలికలపై మాటువేశారు. అదే రోజు సాయం త్రం ఊరిలో కొంత మందిని కలసి ఆశప్ప తిరిగి హైదరాబాద్‌కు వెళ్లేందుకు బైకుపై మరికల్‌కు వచ్చాడు.

మరికల్ టీ తాగేందుకు ఆగిన ఆశప్పపై విజయ్‌కుమార్, నాగేష్, ఆంజనేయులు కారులో అతివేగంగా వచ్చి ఆశప్పను రైఫిల్ గన్‌తో విజయ్‌కుమార్ కాల్చేందుకు ప్రయత్నించగా అది పనిచేయక పోవడంతో బైకుపై ఉన్న సిదార్థ, ప్రశాంత్, మణికాంత్‌లు ముగ్గురు కలిసి వేట కోడవళ్లతో ఆశప్పపై దాడి చేశారు. ఈ దాడితో ఆశప్ప కిందపడిపోవడంతో చనిపోయాడకున్న ప్రత్యర్థులు అక్కడి నుంచి పరారయ్యారు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా జనరల్ దవాఖానకు వైద్యసేవల నిమిత్తం తరలించారు. కేసు దర్యా ప్తు చేపట్టిన పోలీసు అధికారులు అనుమానస్పదంగా ఉన్న విజయ్‌కమార్‌ను గుర్తించా రు. ఈ క్రమంలో సొమవారం ఈ హత్యయత్నానికి పాల్పడిన విజయ్‌కుమార్, ప్రశాంత్, మణికాంత్, శ్రావణ్‌గౌడ్, కిచి నాగేశ్, ఆంజనేయలు, సుభాష్, లింగప్ప, సంజీవ్, రవికుమార్ అదుపులోకి తీసుకొని హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తులు, పిస్టర్, కారు, బైక్‌ను స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఇందులో 4 సిద్దార్థ, జగన్‌గౌడ్, హరికుమార్, విజయ్‌కుమార్‌లు పరారిలో ఉన్నారని తెలిపారు. ఈ కేసును ఛేదించిన అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీధర్, మరికల్ సీఐ ఇఫ్తాకార్ ఆహ్మద్, మరికల్ ఎస్సై జానకిరాంరెడ్డి, నర్వ ఎస్సైలను ఎస్పీ ప్రత్యేకంగా ఆభినందించారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...