మొదటి లెక్క తేలింది


Mon,January 14, 2019 03:29 AM

నాగర్ నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ రెవెన్యూ డివిజన్ల వారీగా 20మండలాల్లోని 453గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో జరగబోతున్న ఎన్నికల సంరంభం రసవత్తరంగా మారుతోంది. తొలివిడతలోని అచ్చంపేట డివిజన్ ఏడు మండలాలకు నామినేషన్ల పర్వం పూర్తవ్వగా ఆదివారంతో ఉపసంహరణ కూడా పూర్తయ్యింది. ఇందులో 160పంచాయతీలకు గాను 37గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. నాలుగు గ్రామాల్లో ఎన్నికలు జరగని పరిస్థితులు ఏర్పడటంతో మిగతా 119గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ 296, వార్డు స్థానాలకు 2091మంది బరిలో నిలవనున్నారు.

ఇక తొలివిడతలో ప్రచారం...
గ్రామ పంచాయతీ ఎన్నికల తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యింది. అచ్చంపేట అసెంబ్లీ పరిధిలోని ఏడు మండలాల్లోని 160గ్రామాలకు గాను నామినేషన్ల స్వీకరణ జరగగా ఆదివారం ఉపసంహరణతో ముగిసింది. ఈ క్రమంలో 37గ్రామ పంచాయతీలకు ఒకే నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లుగా పంచాయతీ అధికారులు స్పష్టం చేశారు. అమ్రాబాద్ కల్ములోనిపల్లి, వంగురోనిపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల్లో బహిష్కరించగా కుమ్మరోనిపల్లిలో ఎస్టీకి రిజర్వుకాగా అభ్యర్థులు ఎవ్వరూ లేనందున ఆ నాలుగు గ్రామాలు మినహాయించి మిగిలిన 119పంచాయతీలకు ఈనెల 21వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అయితే ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఇక పల్లెల్లో ప్రచారం చేయనున్నారు. ఇందులో మండల కేంద్రాల్లో మాత్రం ఎక్కడా ఏకగ్రీవాలు జరగలేదు. దీనివల్ల మండల కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగనుంది.

అచ్చంపేట మున్సిపాల్టీగా మారడంతో మిగతా ఆరు మండలాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉంటుండటంతో ఆయా పార్టీల ముఖ్య నాయకులు కొన్ని గ్రామాల ప్రచారంలో భాగం కాలేని పరిస్థితులు నెలకన్నాయి. ఇక 1376వార్డులకు గాను 364పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగలిన 1000వార్డులకు గాను 2091మంది పోటీలో నిలవనున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు ఖరారు కానుండటంతో పల్లెల్లో ఈనెల 19వ తేదీ వరకు దాదాపుగా వారం పాటు ప్రచారం ఊపందుకోనుంది. ఇందులో అధికాకర టీఆర్ పార్టీ మద్దతుదారులకే గెలుపు అవకాశాలు ఉన్నాయి. అచ్చంపేటలో మొత్తం 37 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం విశేషం. అచ్చంపేట మండలంలోనే పది గ్రామాలు, లింగాలలో 9గ్రామ పంచాయతీలు, బల్మూర్ 5, వంగూరులో 5గ్రామాల చొప్పున, ఉప్పునుంతలలో 4గ్రామాలు, అమ్రాబాద్ రెండు, పదరలో రెం డు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి.

ఈ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం రూ.10లక్షల నగదు ప్రోత్సాహం అందించనుంది. రెండో విడతలో ముగిసిన నామినేషన్ల..ఇక రెండో విడతగా కల్వకుర్తి అసెంబ్లీ పరిధితో పాటుగా నాగర్ నియోజవకర్గంలోని తాడూరు, తెలకపల్లి మండలాలకు, మహబూబ్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఊర్కొండ మండలంలోని 243పంచాయతీలకు ఆదివారంతో నామినేషన్ల గడువు ముగిసింది. ఇందులో నాగర్ జిల్లా పరిధిలోని పది మండలాల్లో 141గ్రామ పంచాయతీలు ఉండగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని తలకొండపల్లి, ఆమన్ మాడ్గుల, కడ్తాల్ మండలాల్లో 102పంచాయతీలతో పాటుగా 888వార్డులు ఉన్నాయి.

ఆదివారం నామినేషన్లు ముగియగా వెల్దండ మండలంలో సర్పంచ్ స్థానాలకు 106మంది, వార్డులకు 469మంది నామినేషన్లు వేశారు. ఇక కేశ్లి తండా, శంకర్ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే ఊర్కొండ మండలంలో, 16గ్రామాలకు 71మంది నామినేషన్లు వేశారు. కల్వకుర్తి మండలంలో 24పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 147మంది , 640మంది వార్డులకు నామినేషన్లు వేశారు. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే కడ్తాల మండలంలో సర్పంచ్ 111మంది, వార్డులకు 512మంది, ఆమనగల్లులో సర్పంచ్ 48మంది, వార్డులకు 192మంది, మాడ్గులలో సర్పంచ్ స్థానాలకు 114మంది, వార్డు స్థానాలకు 591మంది నామినేషన్లు వేశారు. రెండో విడత నామినేషన్లకు ఈనెల 17వ తేదీతో ఉపసంహరణ గడువు ముగియనుంది. ఈ విడతకు 25వ తేదీన ఎన్నికలు జరుగుతాయి.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...