రగిలిన పాతకక్షలు


Mon,January 14, 2019 03:27 AM

జడ్చర్ల,నమస్తేతెలంగాణ : మిడ్జిల్ మండలం వల్లభరావుపల్లి గ్రామంలో పాత కక్షలు భగ్గుమన్నవి. గతంలో జరిగిన పీర్ల పండుగ సందర్భంగా ఇద్దరు వ్యక్తుల మధ్య చో టుచేసుకున్న వ్యక్తిగత వివాదం, తాజాగా ఇరు కుటుంబాల మధ్య కత్తుల దాడికి కారణమైంది. ఈ దాడిలో ఐ దుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. మిడ్జిల్ మండలం వల్లభరావుపల్లి గ్రామానికి చెందిన గౌడ కులస్తుడు జంగం రాము, అదే గ్రామానికి చెందిన నర్సింహ్మ ముదిరాజ్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. వృత్తి రిత్యా ఇరువురు వ్యాపారంలో స్థిరపడినప్పటికి, పీర్ల పండుగ సందర్భంగా ఇద్దరి మధ్య ఏర్పడిన చిన్నపాటి మనస్పర్థలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన జంగం రాములు గౌడ్, నర్సింహ్మ ముదిరాజ్ పాత కక్షల కారణంగా శనివారం సాయంత్రం ఘర్షణ పడ్డారు. ఇదే విషయమై నర్సింహ్మ ముదిరాజ్ గ్రామస్తుల సమక్షంలో పంచాయతీ పెట్టాలని ప్రయత్నించగా, జంగం రాములు అందుకు సహకరించకపోగా, నర్సింహ్మ ముదిరాజ్ దూషిస్తూ, నర్సింహ్మ ఇంటి ముందు నుంచి పోతుండగా, కోపోద్రిక్తులైన నర్సింహ్మ కుటుంబీకులు రాములును ప్రశ్నించారు. ఈ వాదనే ఇరువర్గాల మధ్య ఘర్షణకు చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో నర్సింహ్మ కుటుంబీకులు బం డారు భగవంతు, బండారు నరేష్, బండారు నర్సింహ్మ, బండారు కృష్షయ్య, గండెల్లి, బండారు ఆనంద్ కత్తిపోట్లకు గురికాగా, భగవంతు, కృష్ణయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో జంగం జంగిలయ్య, రాములు, మహేష్, రవికుమార్, ఆంజనేయులు, శ్రీకాంత్ ఉన్నట్లు బాధిత కుటుంబీకులు మిడ్జిల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ ప్రభాకర్ తెలిపారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...